ఢిల్లీలో అరవింద్ కేజ్రివాల్ ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో.. లిక్కర్ మాఫియా ఒకటి. ఉత్తరాది నుంచి దక్షినాది వరకు ఈ లిక్కర్ మాఫియాను విస్తరించారు. ఈ విషయంలో ఢిల్లీ మాజీ డిప్యూటి సిఎం మానిష్ సిసోడియా, అరవింద్ కేజ్రివాల్, కల్వకుంట్ల కవిత, రామచంద్ర పిళ్ళై వంటి వారు జైలుకు వెళ్లి వచ్చారు. అరవింద్ కేజ్రివాల్ పరువు దేశ వ్యాప్తంగా తీసింది ఈ వ్యవహారమే. ఇక తాజాగా ఏపీ లిక్కర్ మాఫియా విషయంలో పార్లమెంట్ లో నరసారావుపేట టిడిపి ఎంపీ లావు కృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏపిలో మద్యం కుంభకోణం జరిగిందని పార్లమెంటు సాక్షిగా కూడా బద్దలు కొట్టారు ఆయన.
Also Read: ప్రత్యక్ష రాజకీయాల్లోకి భువనేశ్వరి..?
ఢిల్లీ మద్యం కుంభకోణానికి ఎన్నో రెట్లు అధికంగా గత జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీలో అక్రమ మద్యం వ్యాపారం జరిగిందని ఆయన పార్లమెంట్ లో మాట్లాడారు. కేవలం ఆరోపణలు చేయడమే కాకుండా వాటికి సంబంధించిన పూర్తి వివరాలు కేంద్ర హోం మంత్రికి అందచేశారు. హోం మంత్రి అమిత్ షా.. లావుని తన కార్యాలయానికి పిలిచి.. ఆరోపణల పై నిజానిజాలు తెలుసుకున్నారు. ఏపీ కుంభకోణంతో పోల్చితే ఢిల్లీ కుంభకోణం నీటి బొట్టంతేనని చెప్తూ.. అందుకు సంబంధిత కీలక పత్రాలను హోం మంత్రికి అందించారు. రూ.90వేల కోట్ల మద్యం వ్యాపారంలో రూ.18 వేల కోట్లు దుర్వినియోగమయ్యాయని లావు వివరించారు. అవికాకుండా మరో రూ.4 వేల కోట్లు బినామీ పేర్లతో దుబాయ్, ఆఫ్రికాలకు తరలించారనే దానిపై కూడా లావు వివరణ ఇచ్చారు.
Also Read: వివేకా హత్య కేసు.. ఇంతకీ అజ్ఞాత వ్యక్తి ఎవరు..?
హైదరాబాద్‌కు చెందిన ఎన్.సునీల్‌రెడ్డి రూ.2 వేల కోట్లను దుబాయ్‌కి తరలించిన కీలకపత్రాలను సైతం లావు అందించడం గమనార్హం. దీనిపై ఈదీ అధికారులు విచారణ జరపాలని లావు కోరగా.. దానికి హోం మంత్రి సానుకూలంగా స్పందించారు. దీనితో వైసీపీ వర్గాల్లో ఆందోళన మొదలైంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫోకస్ పెట్టింది. ఇక కేంద్ర ప్రభుత్వం ఎంటర్ అయితే మాత్రం కేసులో కీలక మలుపులు ఉండే అవకాశం ఉంది. కేంద్ర హోం మంత్రితో జరిగిన తన భేటీ వివరాలు ఎంపి లావు టిడిపి అధినేత చంద్రబాబుని కలిసి వివరించారు. మొత్తం మీద చుస్తే ఇటు రాష్ట్రం, అటు కేంద్రం కూడా జగన్ లిక్కర్ అక్రమాల్ని సీరియస్ గానే తీసుకున్నట్లు అర్ధం అవుతుంది.