Friday, September 12, 2025 09:35 PM
Friday, September 12, 2025 09:35 PM
roots

జట్లు వదిలేసిన ఆటగాళ్లే స్టార్లు అవుతారా..?

ఐపిఎల్.. ఒక ఆటగాడి జీవితాన్ని మార్చే వేదిక. ప్రపంచ వ్యాప్తంగా వందలాది మంది క్రికెటర్లు ఈ లీగ్ లో ఆడేందుకు ఆసక్తి చూపిస్తారు. డబ్బుకు డబ్బు.. పేరుకు పేరు ఇక్కడ సొంతం. ముఖ్యంగా మన దేశంలో ఆర్ధికంగా వెనుకబడ్డ ఆటగాళ్లకు ఇది మంచి అవకాశం. ఒక్కసారి ప్రూవ్ చేసుకుంటే ఇక కెరీర్ తిరుగు ఉండదు. అందుకే వచ్చిన అవకాశాలను రెండు చేతులా అందిపుచ్చుకోవడానికి నానా కష్టాలు పడుతూ ఉంటారు ప్లేయర్స్. ఇది ఒక వైపు అయితే.. కొందరు ఆటగాళ్ళపై నమ్మకం లేక జట్లు వదిలేస్తూ ఉంటాయి.

Also Read : ఒక్క ఫోటోతో షేక్ అవుతున్న టీడీపీ సోషల్ మీడియా

ఇప్పుడు అలాంటి ఆటగాళ్లే జట్టుల్లో కీలక ఆటగాళ్లుగా మారిపోతూ ఉంటారు. ఆ లిస్టు లో కొందరిని చూద్దాం. శ్రేయాస్ అయ్యర్.. ఇతన్ని కలకత్తా ఈ ఏడాది పక్కన పెట్టింది. పంజాబ్ జట్టు భారీ ధరకు కొనుగోలు చేసింది. కెప్టెన్ గా అవకాశం కూడా ఇచ్చింది. బ్యాట్స్మెన్ గా కెప్టెన్ గా రెండు విధాలుగా ప్రూవ్ చేసుకున్నాడు. గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో కీలక సమయంలో విజయ్ కుమార్ వైశక్ కు బౌలింగ్ ఇచ్చి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. విజయ్ కుమార్ వైషక్ విషయానికి వస్తే.. ఇతన్ని ఆర్సీబీ పక్కన పెట్టింది. తీరా చూస్తే.. గుజరాత్ తో మ్యాచ్ లో గేమ్ చేంజర్ అయ్యాడు.

Also Read : బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చెన్నై..

మిచెల్ స్టార్క్… ఇతన్ని గత ఏడాది కలకత్తా భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ ఏడాది ఢిల్లీ జట్టుకు ఆడి.. మొదటి మ్యాచ్ లో కీలక సమయంలో మూడు వికెట్లు తీసాడు. ట్రావిస్ హెడ్.. ఇతన్ని బెంగళూరు జట్టు వదిలేసింది. తీరా చూస్తే.. హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ లోనే ఇతనో సంచలనం. జాస్ బట్లర్, అజింక్యా రహానే, శివం దూబే, హేజిల్ వుడ్ ఇలా కొందరు కీలక ఆటగాళ్ళను ముందు తీసుకున్న జట్లు వదిలేయగా ఇప్పుడు ఆడుతున్న టీంస్ లో వీరు కీలకంగా మారారు. ఇక కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ ఎలా ఆడతారో చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్