Friday, September 12, 2025 07:45 PM
Friday, September 12, 2025 07:45 PM
roots

కన్నీరు పెట్టిస్తున్న అమెరికాలో భారత విద్యార్ధుల దుస్థితి..!

మన దేశంలో అవకాశాలు లేక విదేశాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వెళుతున్న వారికి ఇప్పుడు చుక్కలు కనపడుతున్నాయి. యూరప్ దేశాలతో పాటుగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా దేశాలకు భారత్ నుంచి భారీగా యువత తరలి వెళ్లారు. కరోనా తర్వాత దేశంలో పరిస్థితులు దారుణంగా ఉండటంతో ఇక్కడి నుంచి ఎక్కువ మంది విద్యార్థులు ఈ దేశాలకు వలస వెళ్లిపోయారు. ముఖ్యంగా విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలతో భారీగా సంపాదించుకోవచ్చు అనే ఆశతో అమెరికా సహా పలు యూరప్ దేశాల్లో అడుగుపెట్టారు.

Also Read: అమెరికా దాటుతున్నారా.. పాస్‌పోర్ట్ జాగ్రత్త..!

ఇతర దేశాల్లో పరిస్థితులు ఏమో గాని ఇప్పుడు అమెరికాలో మాత్రం చుక్కలు కనపడుతున్నాయి. లక్షలాది మంది విద్యార్థులు అమెరికాలో ఆకలితో కూడా అలమటించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన అభిషేక్ అనే యువకుడి వ్యవహారం సంచలనం సృష్టించింది. విద్యార్థిగా అమెరికాలో అడుగుపెట్టిన అభిషేక్ అక్కడే వివాహం కూడా చేసుకున్నాడు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. పార్ట్ టైం ఉద్యోగాలు కూడా దొరికే పరిస్థితి అక్కడ లేదు.

Also Read: మంత్రి పదవి ఇస్తే సరి.. లేదంటే లేదంతే..!

ఉద్యోగాలు దొరికినా సరే ఎప్పుడు ఇమ్మిగ్రేషన్ అధికారులు సోదాలు చేస్తారో అర్థం కాని పరిస్థితి. దీనితో ఇంటి నుంచి డబ్బులు పంపించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఒక్కొక్కరు రెండు లేదా మూడు ఉద్యోగాలు చేసుకుని రెండు చేతులా సంపాదించిన పరిస్థితి నుంచి ఇప్పుడు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయి. అభిషేక్ పరిస్థితి కూడా ఇదే. భారత్లో తీసుకున్న స్టూడెంట్ లోన్స్.. లేదంటే ఇతర లోన్లతో ఆర్థిక ఇబ్బందులు కూడా క్రమంగా పెరిగిపోయాయి. దీంతో తల్లిదండ్రులపై భారం వేయలేక.. స్టూడెంట్ లోన్ తిరిగి కట్టలేక అభిషేక్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. భవిష్యత్తులో అమెరికాలో పరిస్థితులు మరింత దారుణంగా మారే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో ఉండి ప్రాణాలు తీసుకోవద్దని దయచేసి భారత్ రావాలని తల్లిదండ్రులు కూడా కోరుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్