Friday, September 12, 2025 09:31 PM
Friday, September 12, 2025 09:31 PM
roots

జగన్‌ను అనుకరిస్తున్న కేటీఆర్..!

రాజకీయాల్లో ఎవరి స్టైల్ వారిది. ఎవరి విధానాలు వాళ్లవి. ఎవరి మాట తీరు వాళ్లదే. అయితే ప్రస్తుతం ఇద్దరు నేతల మాట తీరు చూస్తే మాత్రం.. ఒకేలా అనిపిస్తోంది. అసలు ఎవర్ని ఎవరు ఫాలో అవుతున్నారో తెలియటం లేదనేలా మాట్లాడుతున్నారు. ప్రత్యర్థులపై ఆరోపణలు చేయడం వల్ల మాత్రమే అధికారంలోకి వచ్చిన పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, భారతీయ రాష్ట్ర సమితి. తెలంగాణకు అన్యాయం చేస్తున్నారనే ఒకే ఒక్క ఆరోపణతో.. అధికారంలోకి రావాలనే ఏకైక అజెండాతోనే పార్టీ పెట్టారు కేసీఆర్. అధికారమే లక్ష్యమన్నట్లుగా పార్టీ పెట్టారు జగన్. ఈ విషయంలో ఇద్దరి మనస్తత్వం ఒకటే. అలాగే ఈ ఇద్దరి ఉమ్మడి శత్రువు కూడా చంద్రబాబు. అందుకే ఈ రెండు పార్టీల నేతల మాట తీరు కూడా ఒకేలా ఉంటాయి. ఇప్పుడు ఇద్దరి వ్యవహారం కూడా ఒకేలా ఉన్నాయి.

Also Read : ఈ వారంలోనే పదవుల భర్తీ.. వారికే పెద్ద పీట..!

30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటా అంటూ గొప్పలు చెప్పుకున్నారు జగన్. కానీ సరిగ్గా ఐదేళ్లకే ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోయింది. అటు తెలంగాణలో కూడా హ్యాట్రిక్ విజయం మాదే అని గొప్పగా చెప్పుకున్నారు. తెలంగాణ జాతి పిత అంటూ పెద్ద పెద్ద డైలాగులు వేశారు. కానీ చివరికి పార్లమెంట్ ఎన్నికల్లో బోణీ కూడా కొట్టలేదు. కొన్ని నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా రాలేదు. ఈ రెండు పార్టీల నేతల మధ్య విడదీయలేని మైత్రి బంధం కొనసాగుతోంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు 2019 ఎన్నికల సమయంలో కేసీఆర్ ఎన్నో ప్లాన్లు వేశారు. నాటి చంద్రబాబు ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేశారు. తలసాని శ్రీనివాస్ వంటి పార్టీ నేతలు ఏపీలో పర్యటించి.. నాటి చంద్రబాబు ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. పరోక్షంగా వైసీపీకి అనుకూలంగా ప్రచారం కూడా చేశారు.

Also Read : కడపలో వైసీపీకి షాక్ తప్పదా..?

ప్రస్తుతం ఈ రెండు పార్టీల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. పార్టీలకు చెందిన ముఖ్య నేతలంతా ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోతున్నారు. గతంలో చేసిన తప్పులకు ఇరు పార్టీల నేతలు ఇప్పుడు మూల్యం చెల్లిస్తున్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. బయటకు వచ్చి మాట్లాడేందుకు కూడా ఈ రెండు పార్టీల నేతలు ధైర్యం చేయటం లేదు. ఇలాంటి సమయంలో పార్టీ శ్రేణులను కాపాడుకునేందుకు ఇటు జగన్.. అటు కేటీఆర్ నానా పాట్లు పడుతున్నారు. నాయకుల్లో, కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చేందుకు పెద్ద పెద్ద డైలాగులే చెబుతున్నారు. ప్రత్యేకించి.. కొందరు ప్రభుత్వ పెద్దలతో పాటు పోలీసుల తీరుపై విమర్శలు చేస్తూ వార్నింగులు కూడా ఇస్తున్నారు.

Also Read : తమ్మినేనికి మ్యూజిక్ స్టార్ట్ అయిందా…?

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని తిరిగి యాక్టివ్ మోడ్‌లోకి తెచ్చేందుకు కేటీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. మనమే అధికారంలోకి వస్తున్నామని ఇప్పటికే కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. అటు కేటీఆర్ కూడా జిల్లాల వారీగా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కార్యకర్తలకు అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చిన కేటీఆర్.. పార్టీ శ్రేణులపై తప్పుడు కేసులు పెడుతున్న పోలీసు అధికారులపై చర్యలుంటాయని హెచ్చరించారు. వాళ్లు పదవీ విరమణ చేసినా.. విదేశాల్లో ఉన్నా కూడా వదిలేది లేదని మాస్ వార్నింగ్ ఇచ్చారు. తాను కేసీఆర్ అంత మంచోడిని కాదని కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అచ్చు జగన్ మాదిరే ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వల్లభనేని వంశీని పరామర్శించిన తర్వాత… జగన్ కూడా సేమ్ టూ సేమ్ ఇవే డైలాగులు చెప్పారు. వైసీపీ నేతలు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారు సప్త సముద్రాల అవతల ఉన్నా సరే… తిరిగి రప్పిస్తామంటూ హెచ్చరించారు. జగన్ చెప్పిన మాటలే కేటీఆర్ చెప్పడంతో.. స్క్రిప్ట్ కాపీ తాడేపల్లి నుంచి హైదరాబాద్ వచ్చిందా అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్