మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టిందా…? అంటే ఇప్పుడు అవుననే సమాధానం వినపడుతోంది. తాజాగా ఆయన డిగ్రీ సర్టిఫికెట్ పై ఎమ్మెల్యే కూన రవికుమార్ ఫిర్యాదు చేశారు. తప్పుడు ధ్రువ ప్రత్రాలతో ప్రభుత్వాన్ని ప్రజలను మోసం చేస్తున్నారని.. తాను ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే స్వయంగా వెల్లడించారు. తప్పుడు సర్టిఫికెట్లతోనే ఆయన ఎన్నికల్లో నామినేషన్ కూడా దాఖలు చేసినట్లు వెల్లడించారు. ఇక దీనిపై ప్రభుత్వం కూడా అధికారికంగా స్పందించింది.
Also Read : కేశినేని చూపు బిజెపి వైపు.. ముహూర్తం ఫైనల్..?
దీనిపై విచారణకు ఆదేశిస్తున్నట్లు పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీ.. ఎస్ సురేష్ కుమార్ వెల్లడించారు. దీనిపై విచారణ చేపట్టాల్సిందిగా రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. అటు ఆముదాలవలస నియోజకవర్గంలో ఆయన చేసిన అక్రమాలపై కూడా అధికారులు ఫోకస్ పెట్టారు. పలు చోట్ల భూకబ్జా వ్యవహారాల ఆరోపణలు ఆయనపై వచ్చాయి. దీనిపై ఇప్పుడు విచారణ వేగవంతం చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారాం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారు.
Also Read : ఈ వారంలోనే పదవుల భర్తీ.. వారికే పెద్ద పీట..!
శాసనసభలో ప్రతిపక్ష నాయకులను గౌరవించిన పరిస్థితి కూడా అప్పట్లో ఉండేది కాదు. సాధారణంగా స్పీకర్ వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉంటారు. రాజకీయ అంశాలపై మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడుతారు. కానీ తమ్మినేని విషయంలో మాత్రం అది డిఫరెంట్ గా ఉండేది. మీడియా ముందు బూతులు తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అటు నియోజకవర్గంలో ఆయన కుటుంబ సభ్యులు హడావుడి కూడా అప్పట్లో గట్టిగా నడిచింది. ముఖ్యంగా అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పై తమ్మినేని సీతారాం అప్పట్లో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.