Friday, September 12, 2025 11:40 PM
Friday, September 12, 2025 11:40 PM
roots

టార్గెట్ గ్రేటర్.. బీజేపీ బీసీ ప్లాన్..!

తెలంగాణలో జెండా ఎగురవేసేందుకు భారతీయ జనతా పార్టీ పెద్దలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే పలు కీలక మార్పులు, చేర్పులు చేస్తున్నారు. తెలంగాణపై అత్యధికంగా ఫోకస్ చేశారు. కేంద్ర మంత్రులుగా తెలంగాణకు చెందిన ఇద్దరికి అవకాశం ఇచ్చారు. అలాగే పార్టీ కీలక సమావేశాలు కూడా తెలంగాణలోనే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాజకీయాల్లో పట్టు సాధించేందుకు మరో కీలక ఎత్తుగడ వేస్తోంది బీజేపీ. కుల గణన, ఎస్సీ వర్గీకరణ నిర్ణయాలతో అన్ని సామాజిక వర్గాల్లో పట్టు సాధించేందుకు సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారు. బీసీ కులాల పెద్దలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో తిరిగి అధికారంలోకి వస్తామంటూ మాజీ సీఎం కేసీఆర్ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు.

దీంతో బీజేపీ పెద్దలు ముందుగానే అలర్ట్ అయ్యారు. బీజేపీ అధ్యక్షుని ఎంపిక కసరత్తును ముమ్మరం చేశారు. తెలంగాణ బీజేపీకి ఊపిరిలూదిన నేత బండి సంజయ్. టీ బీజేపీ అధ్యక్షునిగా ఉన్న సమయంలో దూకుడుగా వ్యవహరించారు. టార్గెట్ కేసీఆర్ అన్నట్లుగా బండి సంజయ్ మాటల తూటాలు సంధించారు. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో దాదాపు గెలిచినంత పని చేసింది బీజేపీ. దీంతో బీజేపీ గట్టి పట్టు సాధించిందనే మాట దక్షిణాదిలో కుదుపుకుదిపేసింది. ఇక ఆ తర్వాత అసెంబ్లీ ఉప ఎన్నికల్లో రఘునందనరావు, ఈటల రాజేందర్ విజయం సాధించడంతో కాషాయ పార్టీలో మరింత జోష్ వచ్చింది. పలువురు కీలక నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు కూడా. అయితే సరిగ్గా ఎన్నికలు ఏడాది ముందు బీజేపీ తెలంగాణ పగ్గాలను కిషన్ రెడ్డి చేపట్టారు. దీంతో క్యాడర్ కాస్త చల్లబడినట్లైంది.

సార్వత్రిక ఎన్నికల తర్వాత అధ్యక్షుని మార్పుపై బీజేపీ అగ్రనేతలు దృష్టి పెట్టారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారు. తెలంగాణలో అత్యధిక సామాజిక వర్గం ముదిరాజ్ వర్గానికి చెందిన ఈటల రాజేందర్‌కు అధ్యక్ష పదవి దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. ప్రకటన వెలువడటమే తరువాయి అనుకున్న సమయంలో సీనియర్లు రంగంలోకి దిగారు. అనూహ్యంగా డీకే అరుణ, మురళీధర్ రావు పేర్లు తెర పైకి వచ్చాయి. ప్రస్తుతం అసెంబ్లీ ఫ్లోర్ లీడర్‌గా ఏలేటి మహేశ్వరరెడ్డి ఉండటంతో… అధ్యక్ష పదవి రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. తాను అధ్యక్ష పదవి రేసులో లేనని బండి సంజయ్ స్వయంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఈటల రాజేందర్‌ వైపే అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో పేరుపై ప్రకటన వచ్చే అవకాశం ఉందంటున్నారు కాషాయ పార్టీ నేతలు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్