Friday, September 12, 2025 05:25 PM
Friday, September 12, 2025 05:25 PM
roots

ఈ వారంలోనే పదవుల భర్తీ.. వారికే పెద్ద పీట..!

ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీకి సమయం ఆసన్నమైంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఇప్పటికే 9 నెలలు గడిచింది. ఇప్పటికే టీటీడీ బోర్డు సహా రెండు విడతలుగా నామినేటెడ్ పదవులను చంద్రబాబు సర్కార్ భర్తీ చేసింది. అయితే కొంతమంది పార్టీ నేతలు మాత్రం తమకు కేటాయించిన పదవుల పట్ల అసహనం వ్యక్తం చేశారు. శిష్లా లోహిత్ వంటి నేతలు పదవులు కూడా స్వీకరించలేదు. ఇక పీతల సుజాత వంటి సీనియర్ లీడర్‌కు కార్పొరేషన్ చైర్మన్‌ పదవి ఇచ్చినప్పటికీ… జీవో విడుదల కాకపోవడంతో ఆ పదవి కూడా పెండింగ్‌లోనే ఉంది. అలాగే కావలి గ్రీష్మకు ఎమ్మెల్సీ పదవి రావడంతో.. ఆమెకు కేటాయించిన కార్పొరేషన్ చైర్మన్‌ పదవిని కూడా మరొకరికి ఇవ్వాలని కూటమి సర్కార్ భావిస్తోంది.

Also Read: కేశినేని చూపు బిజెపి వైపు.. ముహూర్తం ఫైనల్..?

అలాగే పలు ప్రముఖ దేవాలయాల పాలక మండళ్లను భర్తీ చేసేందుకు కూటమి ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసింది. ఇప్పటికే పాలకమండళ్ల నియామకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు పూర్తిస్తాయి నివేదిక చేరినట్లు తెలుస్తోంది. తెలుగుదేశంతో పాటు బీజేపీ, జనసేన పార్టీలిచ్చిన సిఫార్సుల జాబితా ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు చేరినట్టు సమాచారం. మొత్తం 21 ప్రముఖ ఆలయాలకు పాలకమండళ్లను నియమించనున్నారు. దేవాలయ కమిటీ చైర్మన్‌తో పాటు సభ్యులను కూడా నియమించేందుకు రంగం సిద్దమైంది. వ్యవసాయ మార్కెట్ కమిటీలను నియమించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయి కసరత్తు మొదలుపెట్టారు. ఏప్రిల్ మొదటి వారంలోగా మార్కెట్ యార్డ్ చైర్మన్ల నియామకాలను చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.

Also Read: ఏపీలో ఐసిస్ డ్రగ్.. ఉలిక్కిపడ్డ కృష్ణా జిల్లా

ఇప్పటికే మార్కెట్ కమిటీల నియామకాలకు సంబంధించిన ప్రక్రియ మొదలైంది. ప్రతి జిల్లా నుంచి నివేదికలు తెప్పించుకుంటున్న అధిష్టానం రిజర్వేషన్ల ఆధారంగా పదవులను భర్తీచేయనుంది. ఎస్సీ, ఎన్టీ, బీసీలతో పాటు ఓసిలకు సమ న్యాయం జరిగేలా సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. జిల్లాల వారీగా రిజర్వేషన్లకు సంబంధించిన నివేదికలు సిద్దమౌతున్నాయి. మహిళలకు కూడా అగ్రి కల్చరల్ మార్కెట్ కమిటీ చైర్మన్లతో పాటు డైరెక్టర్ల పదవులు దక్కనున్నాయి. రాష్ట్రంలో 222 మార్కెట్ కమిటీలు ఉండగా వీటన్నిటికీ చైర్మన్‌తో పాటు 15 మంది సభ్యులను ప్రభుత్వం నియమించనుంది. 50 శాతానికి పైగా పదవులు ఎస్సీ, ఎస్టీ బీసీలకు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధమైనట్టు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్