Tuesday, October 28, 2025 02:28 AM
Tuesday, October 28, 2025 02:28 AM
roots

ఫలించిన నల్లమిల్లి పోరాటం.. పరుగులు పెడుతున్న ప్రభుత్వ యంత్రాంగం…!

పచ్చని పల్లెటూరు.. క్యాన్సర్ మహమ్మారి దెబ్బకు వణికిపోతోంది. దశాబ్దాలుగా ఆ గ్రామంలో క్యాన్సర్ బాధితులు పదుల సంఖ్యలో పెరుగుతూనే ఉన్నారు. పచ్చని పల్లెటూరు పొలిమేరల్లో చావు కేక కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మహమ్మారి దెబ్బకు కుటుంబాలకు కుటుంబాలే కన్ను మూసిన పరిస్థితి. తాజాగా ఈ విషయాన్ని.. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ఈ తీవ్రమైన సమస్యపై ఆయన ప్రభుత్వాన్ని కదిలించారు.

Also Read : ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యిందే..!

బలభద్రపురం గ్రామ ప్రజలకు ప్రమాదంకరంగా మారిన క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకునేలా ఎమ్మెల్యే నల్లమిల్లి అసెంబ్లీలో ప్రస్తావనతో రంగంలోకి దిగిన వైద్యాధికారులు.. చర్యలు చేపట్టారు. ఆఘమేఘాలపై ప్రభుత్వ యంత్రాంగం చర్యలకు దిగింది. క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులకు జీఎస్ఎల్ హాస్పిటల్, స్వతంత్ర హాస్పిటల్ సహకారం కోరారు ఎమ్మెల్యే. నేడు గ్రామంలో 20 వైద్య బృందాలు పర్యటించాయి. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ప్రశాంతి కూడా పర్యటించారు.

Also Read : హైదరాబాద్ లో కుస్తీ తమిళనాడులో దోస్తీ

ఇంటింటికీ సర్వే చేసి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వివరాలు సేకరిస్తున్న వైద్య బృందం.. అవసరమైతే రోగులను అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలోని ప్రజలు గత రెండు సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నారన్న విషయం వెలుగులోకి రావడం, అదే సమయంలో కిడ్నీ సంబంధిత వ్యాధులతో కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంతో ఒక్కసారిగా వార్త సంచలనంగా మారింది. గ్రామంలోని నలుగురు చిన్న పిల్లలకు అతి అరుదైన కాలేయ సంబంధిత వ్యాధి రావడం కూడా గమనార్హం. ఇన్ని రకాల వ్యాధులు ఎందుచేత ప్రబల్లుతున్నాయి? దీనికి కారణం జలకాలుష్యమా? వాయు కాలుష్యమా? లేక వేరే కారణం ఏదైనా ఉందా? అనే దానిపై ప్రభుత్వ యంత్రాంగం ఆరా తీస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్