తెలంగాణాలో అధికారం కోల్పోయి ఇబ్బందులు పడుతోన్న భారత రాష్ట్ర సమితి… ఇప్పుడు కాంగ్రెస్ పై పోరాటానికి నానా కష్హ్తాలు పడుతోంది. మాజీ సీఎం కేసీఆర్.. ఈ మధ్య కాలంలో పెద్దగా బయటకు వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. అయితే కొన్ని రోజుల నుంచి కేసీఆర్ తన వ్యాఖ్యలతో మీడియాలో నానుతున్నారు. తాజాగా ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. తన వద్దకు వచ్చిన పలు నియోజకవర్గాల నేతలతో మాట్లాడారు.
Also Read : మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్ట్ రెడీ
ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు. రాబోయే రోజుల్లో అధికారం బీఆర్ఎస్ దే అని స్పష్టం చేసారు. సింగిల్ గా అధికారంలో వస్తామని అన్నారు. బెల్లం ఉన్న దగ్గర ఈగలు వస్తాయని అలానే సిరిసంపదలు ఉన్న తెలంగాణాని దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారని మండిపడ్డారు. పదేళ్లు తెలంగాణలో ఎటువంటి ఇబ్బందులు లేవన్నారు. ఇప్పుడు సమస్యల వలయంలో తెలంగాణ చిక్కుకుందని ఆనాడు మోడీ నా మెడపై కత్తి పెట్టిన తెలంగాణ కోసం నేను ఎక్కడ వెనకడుగు వేయలేదని స్పష్టం చేసారు.
Also Read : ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యిందే..!
తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ మాత్రమే అని రామగుండంలో గెలిచిన ఎమ్మెల్యే ఓ సన్నాసి.. పార్టీని మోసం చేసాడని మండిపడ్డారు. తెలంగాణకి ఆనాడు ఇందిరాగాంధీ మోసం చేసిందని ఏపీలో కూటమి లేకుంటే చంద్రబాబు గెలిచేవాడు కాదన్నారు. బలవంతంగా మనల్ని ఆంధ్రాలో కలిపారని విమర్శించారు. ఈ నేలపై ఎవరు శాశ్వతం కాదన్నారు. అందరూ ఒక్కో కేసీఆర్ లా తయారు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నోటికి వచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని.. కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదన్నారు.




