Friday, September 12, 2025 05:14 PM
Friday, September 12, 2025 05:14 PM
roots

ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యిందే..!

పాపం.. వైసీపీ నేతల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మెప్పు పొందేందుకు ఏదో చేయబోతే.. అది అటు తిరిగి, ఇటు తిరిగి బూమ్‌రాంగ్ అవుతోంది. చివరికి వైఎస్ జగన్‌నే టార్గెట్ చేస్తోంది. దీంతో.. బోడిగుండంత సుఖం లేదు.. ఊరుకున్నంత ఉత్తమం లేదు అనే మాట ఇప్పుడు వైసీపీ నేతల్లో బాగా వినిపిస్తోంది. తమ అధినేత సుద్దపూస అని.. తమ పార్టీ నేతలంతా అమాయకులు అంటూ విచిత్రమైన అర్థాలు వచ్చేలా చేస్తున్న వ్యాఖ్యలు చివరికి వైసీపీ నేతలకే తగులుతున్నాయి. దీంతో మాట్లాడటం కంటే.. సైలెంట్‌గా ఉండడం బెటర్ అని భావిస్తున్నారు.

Also Read : మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్ట్ రెడీ

రెండు రోజుల క్రితం అసెంబ్లీ సమావేశాలు ముగింపు సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అందులో జగన్‌పైన ఏదో సెటైర్లు వేశారనేది వైసీపీ నేతల ఆవేదన. దీంతో వైసీపీ నేతల్లో కొందరు తెగ గోల చేస్తున్నారు. ప్రభుత్వ సొమ్ముతో ఇలా ఓ మాజీ ముఖ్యమంత్రిపై జోకులు వేయడం ఏమిటని కొందరు.. అసలు ప్రజాధనంతో ఇలాంటి డ్రామాలు వేయడం ఏమిటని కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి అయితే మరో అడుగు ముందుకు వేశారు. శాసనసభ్యుల ఆటలు అంటే వెకిలి స్కిట్లా.. ఆ స్కిట్లతో ఎవరికి ఉల్లాసం.చంద్రబాబు, పవన్ ఉల్లాసం కోసం దిగజారి వ్యవహరిస్తారా.. పార్టీలు వేరైనా సహచర శాసనసభ్యులను, మాజీ ముఖ్యమంత్రిని కించపరచటం సబబేనా..? పవన్ మనసులో ఆలోచనలకు అనుగుణంగానే ఆ స్కిట్లు ఉన్నందుకే ఆ నవ్వులా..? స్పీకర్ అక్కడే ఉండగా.. ఇదేనా మీ విధానం.. ప్రజా సొమ్ముతో నిర్వహించే కార్యక్రమాల్లో పైశాచిక ఆనందం కోసం ఇలాంటి వెకిలి స్కిట్ లా.. నిలబెట్టుకుంటే దక్కేది మర్యాద.. పంచితే పెరిగేది గౌరవం.. రెండూ తప్పిదే మిగిలేది అవమానం.. ప్రతి చర్యకు విధి బలమైన సమాధానం చెబుతుంది. ప్రతి చర్య భరించేందుకు సిద్ధంగా ఉండాల్సిందే.. అంటూ పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి పుష్ప శ్రీ వాణి.

Also Read : పోలీసులకు మూడుతోంది… ప్రక్షాళన మొదలు

దీనికి టీడీపీ, జనసేన పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘాటుగానే బదులిస్తున్నారు. మీలా టిక్ టాక్ వీడియోలు చేయాలా మేడం.. అంటూ సెటైర్లు వేశారు. అసలు ఐదేళ్ల పాటు అసెంబ్లీలో, బయట వైసీపీ వాళ్లు చేసింది ఏమిటో చెప్పండి .. అని ప్రశ్నించారు. శాసనసభ్యులంటే వైసీపీ నేతల్లా అసెంబ్లీలో బూతులు మాట్లాడాలి.. లేదా పరాయి స్త్రీ క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడాలి.. అది కాకుంటే జగన్ రెడ్డి భజన చేయాలి.. అంతేనా మేడం అంటున్నారు. కించపరచడం అంటే ఖచ్చితంగా తప్పే.. మరి సిద్ధం సభల్లో చంద్రబాబు, పవన్, లోకేష్ బొమ్మలు పెట్టి.. వాటిని వైసీపీ రౌడీ మూకలు కాళ్లతో తన్నినప్పుడు మీకు తప్పుగా అనిపించలేదా అని నిలదీస్తున్నారు. మర్యాద, గౌరవం అనేది వైసీపీ నేతలకు అసలు సూట్ కాదని.. ఈ రెండు పాటించలేదు కాబట్టే మీకు అవమానం మిగిలింది అంటూ కౌంటర్ ఇస్తున్నారు. ప్రతి చర్య బలంగా ఉంది కాబట్టే.. ప్రజలు 11 స్థానాలతో సరిపెట్టారనే విషయం మర్చిపోతే ఎలా.. అంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ సొమ్ముతో నిర్వహించిన బహిరంగ వేదికపై పవన్ కల్యాణ్, చంద్రబాబుపై మాజీ మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యలు చేసిన విషయం కూడా మీకు గుర్తు లేదా అంటూ పాత వీడియోలు పోస్టు చేస్తున్నారు. దీంతో బాబోయ్.. ఇదేదో అయ్యేలా ఉందే అంటున్నారు వైసీపీ నేతలు. మనంతట మనమే జగన్‌ చేసిన తప్పులను బయట పెట్టిస్తున్నామని వాపోతున్నారు. ఇకపై ఇలా ప్రభుత్వం గురించి విమర్శించాలంటే.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిందా లేదా అనేది పరిశీలించుకోవాలని కూడా పార్టీ నేతలకు పెద్దలు సూచిస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్