Wednesday, May 6, 2026 07:51 PM
Wednesday, May 6, 2026 07:51 PM

కాంగ్రెస్‌తో గొంతు కలిపిన జగన్

దేశవ్యాప్తంగా ఎంపీ స్థానాల డీలిమిటేషన్ విషయంలో పెద్ద చర్చ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కు తగ్గాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు అధికార పార్టీ డిఎంకె దీనిపై పెద్ద పోరాటమే చేస్తుంది. తాజాగా ప్రతిపక్ష పార్టీలతో సీఎం స్టాలిన్ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటుగా పలువురు ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు హాజరయ్యారు. దీని ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అనేది ప్రతిపక్ష పార్టీల వాదన.

Also Read : హైదరాబాద్ లో కుస్తీ తమిళనాడులో దోస్తీ

ఇక తాజాగా దీనికి ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా గొంతు కలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఘాటుగా లేఖ రాశారు జగన్. డీ లిమిటేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గాలని.. దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గకుండా చూడాలని జగన్ కోరారు. 2026 లో జరిగే డీ లిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన నెలకొందని.. ఎంపీ సీట్లు తగ్గుతాయని దక్షిణాదిలో చర్చ జరుగుతుందన్నారు. గత 15 ఏళ్లలో దక్షిణాదిలో జనాభా తగ్గిందని గతంలో కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపు వల్లే తగ్గింది అని పేర్కొన్నారు.

Also Read : కేసీఆర్ సంచలన కామెంట్స్.. చంద్రబాబుపై కూడా..!

ఇప్పటి జనాభా లెక్కల ప్రకారం ఢిల్లీ మెడిటేషన్ చేస్తే ఇక్కడ ఎంపీ సీట్లు తగ్గుతాయని.. డీ లిమిటేషన్ జనాభా ప్రాతిపదికన కాకుండా చూడాలని కోరారు. దక్షిణాది రాష్ట్రాలలో అణిచివేసే పార్టీ బిజెపి అని.. మన సంస్కృతి, గుర్తింపు, ప్రగతి, సామాజిక న్యాయం ప్రమాదంలో పడుతుందన్నారు. మన రాష్ట్రాలకు సంబంధించి ఇతరులు నిర్ణయం తీసుకుంటున్నారని అది రాష్ట్ర ప్రజల ఉనికి లేకుండా చేస్తుందన్నారు. డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాలను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నారు జగన్.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్