Saturday, September 13, 2025 01:19 AM
Saturday, September 13, 2025 01:19 AM
roots

ఇంకులేని పెన్ను.. తాటిపర్తికి స్ట్రాంగ్ కౌంటర్..!

వైసీపీ నేతలకు ఇదో అలవాటుగా మారిపోయింది. ప్రతి విషయానికి దళిత అనే మాట బాగా వాడుతున్నారు. కులాల ప్రస్తావన లేకుండా ఒక్కమాట కూడా మాట్లాడటం లేదు. తప్పు చేసిన వాడు ఏ కులం వాడు అనేది చూడకూడదు అనేది భారతీయ న్యాయ శాస్త్రం చెబుతున్న మాట. అయితే వైసీపీ నేతలు మాత్రం.. తప్పు చేసిన వారిని కులం పేరుతో సమర్థిస్తున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన పనిని తప్పు అని ఎత్తి చూపినందుకు కులం పేరుతో దూషిస్తున్నారా అని వక్ర భాష్యం చెబుతున్నారు తాటిపర్తి చంద్రశేఖర్‌. అయితే అసలు విషయం వదిలేసి ఇలా కులం పేరు ప్రస్తావించడం ఏమిటని ఇప్పుడు తాటిపర్తిని అంతా కౌంటర్ చేస్తున్నారు.

Also Read : ఆ క్రెడిట్ చంద్రబాబుదే.. పవన్ కు చంద్రబాబు థాంక్స్..!

కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు సైలెంట్‌గా సభకు వచ్చి అటెండెన్స్ రిజస్టర్‌లో సంతకం పెట్టి వెళ్లిపోతున్నారు. ఈ విషయం గుర్తించిన స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు.. వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు రాకుండా ఇలా సంతకాలు చేసి వెళ్లడం ఏమిటని నిలదీశారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు.. ఇలా దొంగల్లా సంతకాలు చేసి వెళ్లిపోవడం సరికాదన్నారు కూడా. దీంతో వైసీపీ నేతల దొంగ పనులు వెలుగులోకి వచ్చాయి. అసెంబ్లీ బాయ్‌కాట్ అంటూ జగన్ చెబుతుంటే.. వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం సైలెంట్‌గా వచ్చి సంతకాలు చేసి పోతున్నారు. దీంతో ఇదేందయ్యా అంటూ అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తాము చేసిన తప్పు బయటకు రావడంతో.. దీని నుంచి బయట పడేందుకు వైసీపీ నేతలకు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి.

Also Read : పెట్టుబడుల విషయంలో బాబు వ్యూహం వర్కౌట్ అవుతుందా..?

కులం కార్డు బయటకు తీసిన వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్.. బహుజన శాసనసభ్యులను దొంగలని సంభోదించడం స్పీకర్ విజ్ఞతకు వదిలేస్తున్నా.. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అలాగే “ప్రజాస్వామ్యంలో దొంగలంటే ముఖ్యమంత్రిని వెన్నుపోటు పొడిచి కుర్చీ ఎక్కినోళ్లు, వేలంపాటలో సభ్యులను సరసమైన ధరతో కొన్నోళ్లు, వైశ్రాయ్ హోటల్లో క్యాంపులు నడిపినోళ్లు, స్పీకర్‌ను అడ్డుపెట్టుకుని పార్టీ పక్షనేతను పోటు పొడిచినోళ్లు, జయప్రదంగా పార్టీని, పార్టీ నిధిని దోచినోళ్లని స్పీకర్ గారు తెలుసుకోగలరని ఆశిస్తున్నా..” అంటూ వ్యాఖ్యలు చేశారు. అలాగే ” మేమేమి గోడలు దూకి, అర్థరాత్రులు, అపరాత్రుల్లో సంతకం పెట్టలేదు.. మా నియోజకవర్గ సమస్యలను ప్రశ్నల రూపంగా సభ ముందుకు తీసుకొచ్చే క్రమంలో అసెంబ్లీ సిబ్బంది సూచన మేరకే సంతకాలు పెట్టాం కానీ దొంగలుగా కాదు..” అంటూ ముగించారు.

Also Read : కార్యకర్తల కోసం ఓ రోజు.. చంద్రబాబు, లోకేష్ కీలక నిర్ణయం

వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలకు కూటమి నేతలు, అభిమానులు ఘాటుగా బదులిస్తున్నారు. ప్రతి విషయానికి ఇలా కులం కార్డు వాడటం ఏమిటని నిలదీస్తున్నారు. దొంగల్లా సంతకం పెట్టి వెళ్లిన మాట నిజం కాదా అని నిలదీస్తున్నారు. స్పీకర్ చదివిన పేర్లల్లో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పేరు కూడా ఉంది కదా.. మరి ఆయన కూడా బహుజన ఎమ్మెల్యేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. దొంగ అని స్పీకర్ అంటే అంతలా బాధపడే బదులు రాజాలా వెళ్లి సంతకం పెట్టి.. అసెంబ్లీలో కూర్చోవచ్చు కదా. అని విమర్శలు చేస్తున్నారు. అలాగే నియోజకవర్గ సమస్యలు ప్రశ్నల రూపంలో ఎవరికి ఇచ్చారో చెప్పండి అంటున్నారు. “సంతకం పెట్టి వెళ్లండి.. మీ సమస్య మేము చూసుకుంటామని సిబ్బంది మీకు చెప్పారా.. నియోజకవర్గం సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడటం చేతకాదు కానీ.. పబ్లిసిటీ కోసం అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకోవడం ఏమిటి. అసెంబ్లీలో ఏ సమస్యపై చర్చించారు. ఒక అభివృద్ధి పని చేయగలిగారా. నియోజకవర్గానికి నీ అవసరం శూన్యం. ఇంకులేని పెన్ను, రిటైర్డ్ అధికారి, మాజీ ఎమ్మెల్యే ఎలా అయితే పవర్ లేకుండా నేను అది నేను ఇది అని చెప్పుకుంటారో… మీరు కూడా అంతే” అంటూ సోషల్ మీడియాలో తాటిపర్తిపై సెటైర్లు వేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్