Saturday, September 13, 2025 01:09 AM
Saturday, September 13, 2025 01:09 AM
roots

వైసీపీలో ఫుల్ స్క్రాప్.. జగన్‌కు సినిమా..!

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చుట్టూ కోటరీ చేరిందని.. వారి మాట మాత్రమే జగన్ వింటున్నాడని ఇటీవల మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఆ కోటరీని పక్కన పెట్టకపోతే జగన్ మరోసారి సీఎం కుర్చీలో కుర్చోవడం కష్టమని కూడా విజయసాయిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. అంతటితో ఆగకుండా.. వైసీపీని ఇప్పటికైనా ప్రక్షాళన చేయాలన్నారు విజయసాయిరెడ్డి. దీంతో కొందరు వైసీపీ నేతలు టార్గెట్ విజయసాయిరెడ్డి అన్నట్లుగా విమర్శలు కూడా చేశారు. అయితే ఇదే సమయంలో అసలు వైసీపీలో ఏం జరుగుతోంది.. జగన్ చుట్టూ నిజంగానే కోటరీ ఉందా.. అసలు వైసీపీలో ప్రక్షాళన చేయాలంటే ఏం చేయాలనే విషయంపై లోతుగా పరిశీలించారు.

Also Read : పెట్టుబడుల విషయంలో బాబు వ్యూహం వర్కౌట్ అవుతుందా..?

వైసీపీలో కావాల్సినంత చెత్త చేరుకుందనేది బహిరంగ రహస్యం. ఇంకా చెప్పాలంటే వైసీపీలో ఉన్న నేతల్లో సగం మంది జగన్ భజన చేసే వారే తప్ప.. మరెవరు కనిపించటం లేదు. ఇందులో కొంత మంది ఒక్కసారి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేదు. కొంతమంది అయితే తొలిసారి గెలిచిన వారే. అయినా సరే.. వారంతా సీనియర్లు అంటూ బిల్డప్ ఇస్తున్నారు. ఇంక కొంతమంది అయితే జగన్ అంటే ప్రాణమని.. ఆయన కోసం ప్రాణాలిస్తామంటూ తెగ గొప్పలు చెప్పుకుంటున్నారు కూడా. కానీ ఇలాంటి వారి వల్లే పార్టీకి కావాల్సినంత చెడ్డ పేరు అనే విషయం జగన్ మోహన్ రెడ్డికి ఎప్పుడు తెలుస్తుందో అని కొంతమంది సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read : ఆ క్రెడిట్ చంద్రబాబుదే.. పవన్ కు చంద్రబాబు థాంక్స్..!

రాజకీయాల్లో కనీస విలువలు పాటించని నేతలంతా ప్రస్తుతం వైసీపీలోనే ఉన్నారు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనటం.. ప్రత్యర్థి పార్టీల నేతలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం.. దాడులు చేయడం.. అక్రమార్జనలో మునిగితేలటం.. ఇదే వైసీపీలో ఎక్కువ మంది నేతల తీరు. అటు శ్రీకాకుళం జిల్లా నుంచి ఇటు అనంతపురం జిల్లా వరకు ఇలాంటి వారే అధికంగా ఉన్నారు. దువ్వాడ శ్రీనివాస్, కొడాలి నాని, రోజా, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జోగి రమేష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, లేళ్ల అప్పిరెడ్డి, అంబటి రాంబాబు, గోరంట్ల మాధవ్.. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా పెద్దగానే ఉంది. అయితే ప్రస్తుతం వైసీపీ వైసీపీలో ఇలాంటి వారే చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. భార్యను, కన్న కూతుర్లను గాలికి వదిలేసిన దువ్వాడ మరో మహిళతో కలిసి సహ జీవనం చేస్తున్నాడు. పైగా అదేదో గొప్ప పని అన్నట్లుగా రోజూ వీడియోలు, ఇంటర్వ్యూలు. ఇక నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనే కొడాలి నాని, రోజా. ప్రత్యర్థి పార్టీల నేతలపై నోటితో విరుచుకుపడటం తప్ప.. వీరికి ప్రజల్లో ఏ మాత్రం మంచిపేరు లేదు. చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన జోగి రమేష్ అయితే.. కుటుంబం కోసం పార్టీ కార్యకర్తలను గాలికి వదిలేశారు. భూమి కనిపించటం పాపం అన్నట్లుగా కబ్జాలు చేశారు.

Also Read : కార్యకర్తల కోసం ఓ రోజు.. చంద్రబాబు, లోకేష్ కీలక నిర్ణయం

ఇక పిన్నెల్లి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మాచర్ల నియోజకవర్గంలో వరుసగా 5 సార్లు గెలిచిన పిన్నెల్లి నియోజకవర్గం అభివృద్ధికి చేసింది ఏం లేదు కానీ.. ఇసుక, మద్యం వ్యాపారాల్లో భారీగానే కూడబెట్టారు. ఇక ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలను హత్యలు కూడా చేయించారు. బుల్లెట్ దిగిందా లేదా.. అని సభలో వ్యాఖ్యలు చేసిన అనిల్ కుమార్ యాదవ్.. ఆ తర్వాత నోటితోనే రెచ్చిపోయి వ్యాఖ్యలు చేశారు. ఇక అంబటి రాంబాబు, గోరంట్ల మాధవ్ గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఒకరు గంట చాలంటే.. మరొకరు వీడియో కాల్స్.. ఈ వ్యవహారం ఇప్పటికీ ప్రజల్లో నానుతోంది. ప్రస్తుతం వీరే వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వాళ్లను ఇప్పటికైనా జగన్ పక్కన పెట్టకపోతే.. పార్టీ మనుగడే కష్టం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కానీ వీళ్లను జగన్ వదిలే సమస్య లేదు అని కూడా చెబుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్