ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు చివరి రోజుకు చేరుకున్నాయి. ఉదయం 9 గంటలకు 15 వ రోజు ఏపీ శాసన సభ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ప్రశ్నోత్తరాలతో ఉభయ సభలు ప్రారంభం కాగా… శాసన సభలో ఆయకట్టు స్థిరీకరణ.. తోటపల్లి ప్రాజెక్ట్ ఆధునికీకరణ… పోలీస్ కానిస్టేబుళ్ల భర్తీ పై సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. ఎస్ ఐ లకు డి ఎస్పీ లుగా ప్రమోషన్లు.. కేంద్ర ప్రాయోజిత పథకాలపై ప్రశ్నలు వేయగా వాటికి సమాధానాలు ఇచ్చారు మంత్రులు. ఎస్సి వర్గికరణ పై ఏక సభ్య కమిషన్ రిపోర్ట్ ఉభయ సభలు ముందు ఉంచనున్నారు మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి.
Also Read : వంశీని వైసీపీ వదిలేసినట్లేనా..?
ఎస్సి వర్గికరణ అంశం పై స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఎస్సి వర్గీకరణ పై తీర్మానం చేయనుంది ఏపీ అసెంబ్లీ. అటు మండలిలో కూడా కీలక చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మిని గోకూలాలు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై చర్చ జరగనుంది. ఆసుపత్రుల ఆధునీకరణ… నూతన పరిశ్రమల స్థాపన తదితర అంశాలపై ప్రశ్నలు ఉండనున్నాయి. ఇక సమావేశాలకు వైసీపీ హాజరు కాకపోయినా అసెంబ్లీలో పలు ప్రశ్నలు లేవనెత్తింది. అయితే మంత్రులు వాటికి సమాధానం ఇచ్చినా వినడానికి సభలో ఎమ్మెల్యేలు లేకపోవడం గమనార్హం.
Also Read : కుప్పం వైసీపీ కొప్పు ఊడుతుందా…?
ఇక దీనిపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. వైసీపీ సభ్యుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేసారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు దొంగచాటుగా వచ్చి.. రిజిస్టర్ లో సంతకాలు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రశ్నలు అడుగుతున్నారు గాని సభకు మాత్రం రావడం లేదని అసహనం వ్యక్తం చేసారు. దొంగచాటుగా, దొంగలు మాదిరిగా వచ్చి సంతకాలు పెట్టడం ఏంటీ అని నిలదీశారు. ఇది ఎంత వరకు కరెక్ట్ అంటూ నిలదీశారు అయ్యన్న. ఎన్నికైన సభ్యులు సభకు రావాలని సూచించారు.