ఆంధ్రప్రదేశ్ లో గత ఐదేళ్లుగా పెట్టుబడుల విషయంలో.. రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా ఫోకస్ పెట్టలేదు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత… చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే విషయంలో ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఇటీవల దావోస్ పర్యటనకు వెళ్ళిన చంద్రబాబు రాష్ట్రంలో పరిస్థితులను వివరించి పెట్టుబడులు తెచ్చేందుకు నానా కష్టాలు పడ్డారు. ఇక త్వరలోనే దావోస్ లో జరిగిన కొన్ని ఒప్పందాల విషయంలో కీలక అడుగుల పడే అవకాశాలు ఉన్నాయి.
Also Read : తెలంగాణా ప్రభుత్వ బడ్జెట్ హైలెట్స్ ఇవే
ఇక తాజాగా రాష్ట్రానికి కీలక కంపెనీలను తీసుకువచ్చేందుకు చంద్రబాబు మరోసారి జాతీయస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఢిల్లీలో వీరిద్దరి సమావేశం జరిగింది. 30 ఏళ్ల క్రితం బిల్ గేట్స్ లో చంద్రబాబు నాయుడు సమావేశమైన తర్వాత హైదరాబాద్ రూపరేఖలు మారాయి. దేశంలో ఐటి విప్లవం మొదలైంది. ఇక ఇప్పుడు గేట్స్ ఫౌండేషన్ తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకుంది.
Also Read : సునీత విలియమ్స్ ఇండియా టూర్ ఫైనల్…!
విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ ఏపీకి సహకారం అందించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటికి సంబంధించిన అంశాలపై గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులతో ఏపీ ప్రభుత్వాధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి మార్చుకున్నారు. దీనితో దేశంలో మరోసారి చంద్రబాబు విప్లవానికి తెరతీయబోతున్నారు అంటూ జాతీయ మీడియా కూడా కథనాలు రాయడం మొదలుపెట్టింది. 30 ఏళ్ల క్రితం ఐటి విప్లవానికి తెరతీసిన చంద్రబాబు.. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఫోకస్ పెట్టారు. రాష్ట్రాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పరుగులు పెట్టించేందుకు యూనివర్సిటీలను కూడా ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.