సినీ నటుడు పోసాని కృష్ణ మురళి సింపతి కార్డు బయటికి తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ పెద్దల అండ చూసుకుని రెచ్చిపోయిన పొసాని కృష్ణ మురళి ఇప్పుడు బెయిల్ రాకపోవడంతో సింపతి కార్డు వాడుకునేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు. గుంటూరు కోర్టులో విచారణ జరిగిన సమయంలో ఆయన మాట్లాడిన మాటలు ఆశ్చర్యం కలిగించాయి. రెండు రోజుల్లో బెయిల్ రాకపోతే తనకు ఆత్మహత్య శరణ్యం అంటూ ఆయన మాట్లాడటం చూసి కొంతమంది షాక్ అయ్యారు.
Also Read : రజనీ కేసు ఆగినట్టేనా…? గవర్నర్ రియాక్షన్ ఎక్కడ…?
చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సమయంలో పోసాని కృష్ణ మురళి చాలా చులకనగా మాట్లాడారు. చంద్రబాబు కుటుంబ సభ్యుల ఆవేదన పై ఆయన మీడియా సమావేశాల్లో సెటైర్లు వేశారు. సాక్షి ఛానల్ డిబేట్లో కూర్చొని ఎన్నో మాటలు మాట్లాడారు. ఇక ఇప్పుడు తనకు ఆరోగ్యం బాగాలేదని, తనకు భార్యాభర్తలు ఉన్నారని బెయిల్ ఇవ్వాలని.. న్యాయమూర్తి ముందు ఆయన తన వాదన వినిపించారు. పోసాని కృష్ణ మురళి… చంద్రబాబు నాయుడిని అలాగే టిడిపి నేతలు విమర్శించిన సమయంలో కూడా ఆయన ఆరోగ్యం బాగాలేదు.
Also Read : రెబల్ స్టార్ కి సందీప్ వంగ కండీషన్లు.. వర్క్ అవుట్ అయ్యేనా?..!
అప్పట్లో ఆయన గుండె కు స్టంట్ వేశారు అయినా సరే పోసాని కృష్ణమురళి అప్పట్లో రెచ్చిపోయి మీడియా సమావేశాల్లో మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు అరెస్టు చేసేసరికి పోసాని సింపతి కార్డు బయటకు తీసి బెయిల్ పొందే ప్రయత్నం చేస్తున్నారు అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. వాస్తవానికి పోసాని నిన్న విడుదల అయిపోతారని అందరు భావించారు. కానీ మొన్న సాయంత్రం సిఐడి ఎంటర్ కావడంతో సీన్ రివర్స్ అయింది. టిడిపి అధికార ప్రతినిధి చేసిన ఫిర్యాదుతో సిఐడి అధికారులు రంగంలోకి దిగి పోసాని కృష్ణ మురళిని తమ అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆయనను మరో 14 రోజులపాటు విచారించే అవకాశాలున్నాయి.