Friday, September 12, 2025 07:26 PM
Friday, September 12, 2025 07:26 PM
roots

రాజకీయాలకు వంగవీటి గుడ్ బై..!

వంగవీటి రాధాకృష్ణ… తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో వంగవీటి పేరు ఓ బ్రాండ్. వంగవీటి రంగా వారసునిగా రాధా రాజకీయాల్లో ప్రవేశించారు. విజయవాడ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నప్పటికీ.. తెలుగుదేశం పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరించారు. కాంగ్రెస్, ప్రజారాజ్యం, వైసీపీ తర్వాత తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు వంగవీటి రాధ. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టికెట్ ఆశించిన రాధా… పార్టీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు వెనక్కి తగ్గారు. కాపు సామాజిక వర్గంలో కీలక నేతగా గుర్తింపు పొందిన రాధాకృష్ణ.. పొలిటికల్ బాంబు పేల్చారు. రాజకీయ సన్యాసం చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.

Also Read : తిట్టిన వారికే పదవులు.. ఇదెక్కడి లాజిక్..!

అసెంబ్లీ టికెట్ ఆశించిన రాధాకు ఎమ్మెల్సీగా అయినా అవకాశం వస్తుందని ఆయన సన్నిహత వర్గాలు ఆశించాయి. కానీ అలా జరగలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రాధా… రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ విషయం తన సన్నిహితులతో జరిగిన చర్చలో వెల్లడించినట్లు తెలుస్తోంది. అత్యంత సన్నిహితుల వద్ద రాధా ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో విజయవాడ రాజకీయాల్లో ఒక బాంబు పేలినట్లుగా అయ్యింది. ఆత్మాభిమానంతో కొన్నిసార్లు రాజకీయాల్లో చెడ్డపేరు కూడా తెచ్చుకున్నారు. టికెట్ రాకపోతే గట్టిగా స్వరం వినిపించడం వల్ల చెడ్డపేరు తెచ్చుకున్నారు రాధా. చివరికి లౌక్యం తెలియని నేతగా రాధాపైన ముద్ర పడింది.

Also Read : పార్టీ క్యాడర్ ను ముంచుతున్న ఎమ్మెల్యే…?

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాధాకు అవకాశం వస్తుందని ఆయన అభిమానులంతా ఆశపడ్డారు. కానీ అలా జరగలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రాధాకృష్ణ… రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సంచలన బాంబు పేల్చారు. రాజకీయ కారణాలతో పాటు కుటుంబ కారణాలున్నట్లు తెలుస్తోంది. తొలి నుంచి పదవుల కోసం రాధా పాకులాడలేదు అనేది ఆయన అభిమానుల మాట. తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం రాధా తీవ్రంగా కృషి చేశారు. 2019 ఎన్నికలప్పుడు రాధాకు టికెట్ రాలేదు. పైగా స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఆ తర్వాత కూడా రాధాకు గుడివాడ అసెంబ్లీ టికెట్ ఇస్తారని… విజయవాడ పార్లమెంట్‌ టికెట్ ఇస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ చివరికి 2024 ఎన్నికల్లో కూడా రాధాకు టికెట్ ఇవ్వాలేదు. దీంతో ఎమ్మెల్సీగా అవకాశం వస్తుందని అంతా భావించారు. కానీ జాబితాలో రాధా పేరు లేకపోవడంతో రాజకీయ సన్యాసం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్