Tuesday, October 28, 2025 02:16 AM
Tuesday, October 28, 2025 02:16 AM
roots

ఇక ఆ సీనియర్ నేత కథ ముగిసినట్లేనా..!

తెలుగుదేశం పార్టీలో సీనియర్ల హవా దాదాపు క్లోజ్ అయినట్లే తెలుస్తోంది. తరంతో పాటు స్వరం కూడా మారిపోతుంది. నిన్నటి వరకు పార్టీలో చక్రం తిప్పిన నేతలంతా ఇప్పుడు మాజీలుగా మారిపోయారు. కనీసం మాట్లాడేందుకు కూడా అవకాశం రావడం లేదు. ఇలాంటి వారిలో ముందు వరుసలో ఉన్న పేరు యనమల రామకృష్ణుడు. 1995 ఆగస్టు సంక్షోభం సమయంలో చంద్రబాబుకు మద్దతు తెలిపారు. దీంతో ఆయన తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా మారిపోయారు. స్పీకర్‌గా, మంత్రిగా, పోలిట్‌బ్యూరో సభ్యునిగా పార్టీలో అత్యంత కీలకంగా వ్యవహరించారు. అయితే ఇప్పుడు అదే యనమల రామకృష్ణుడు స్వరం పూర్తిగా మారిపోయింది.

Also Read : తిట్టిన వారికే పదవులు.. ఇదెక్కడి లాజిక్..!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. గతంలో పార్టీలో సీనియర్లకే పెద్దపీట వేశారు. అయితే ఇప్పుడు మాత్రం అదే సీనియర్లను పక్కన పెట్టి… యువతను ప్రొత్సహిస్తున్నారు. కొందరు సీనియర్లను పెట్టేశారు. ఇలాంటి వారిలో తాజాగా యనమల రామకృష్ణుడు చేరిపోయారు. ఎన్నికల సమయంలో దేవినేని ఉమా, అశోక్ గజపతిరాజు వంటి నేతలకు టికెట్లు ఇచ్చేందుకు నిరాకరించిన చంద్రబాబు… తాజాగా యనమలను కూడా పూర్తిగా పక్కన పెట్టేశారు. ఎమ్మెల్సీగా యనమల పదవి కాలం ముగిసింది. బీసీ నేతగా గుర్తింపు పొందిన యనమలకు చంద్రబాబు మరో అవకాశం ఇస్తారని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. కనీసం ఆయన పేరును పరిగణలోకి కూడా తీసుకోలేదని పార్టీ వర్గాల సమాచారం.

Also Read : పవన్ ఫ్యాన్స్ కు మళ్ళీ షాక్ తప్పదా…?

వాస్తవంగా వరుసగా విజయాలు సాధించిన యనమల 2004 ఎన్నికల్లో తొలిసారి ఓడిపోయారు. దీంతో ఆ తర్వాత నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ తమ్ముడు కృష్ణుడికి అవకాశం ఇచ్చారు. అయితే ఒక్కసారి కూడా సోదరుడు గెలవకపోవడంతో 2024 ఎన్నికల్లో యనమల కుమార్తె దివ్యకు అవకాశం ఇచ్చారు చంద్రబాబు. భారీ మెజారిటీతో గెలిచిన దివ్యను విప్‌ పదవి కూడా వరించింది. దీంతో తుని నియోజకవర్గంలో యనమల పెత్తనమే నడుస్తోంది. అయితే యాదవ సామాజిక వర్గం నుంచి యనమలకు బదులుగా బీద రవిచంద్రకు బాబు అవకాశం ఇచ్చారు. కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ఇప్పటికే పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పోలిట్‌బ్యూరో నుంచి తప్పించడం ఖాయమనే మాట వినిపిస్తోంది. మొత్తానికి తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు తెచ్చుకున్న యనమల రామకృష్ణుడు ఇకపై కేవలం తుని నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అంటున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్