సినీ నటుడు పోసాని కృష్ణ మురళి పై తాజాగా మరో కేసు నమోదయింది. జనసేన పార్టీలో యాక్టివ్ గా ఉండే బాడిద శంకర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విజయవాడ రూరల్ భవానిపురం పోలీస్ స్టేషన్లో ఆయన పై కేసు నమోదు చేశారు. క్రైమ్ నెంబర్ 657 /2024 ప్రకారం 153, 153a,354A1,502(2),505(1),(c),IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పోసాని కృష్ణ మురళి పై 17 కేసుల నమోదు చేశారు పోలీసులు. ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని భవానిపురం.. సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు నమోదు అయ్యాయి.
Also Read : గెలిచినా… ఉపయోగం లేకుండా పోయిందే..!
తాజాగా మరో కేసు నమోదు చేశారు. దీనితో పోసాని కృష్ణ మురళిని కర్నూలు జిల్లా జైలు నుండి భవానిపురం పోలీస్ స్టేషన్ కు తరలించనున్నారు పోలీసులు. అర్ధరాత్రి నరసరావుపేట పోలీసుల కస్టడీ పిటిషన్ రద్దు చేయడంతో భవానిపురం పోలీసులు.. కర్నూలు జిల్లా నుండి హైదరాబాద్ మీదుగా భవానిపురం తీసుకురానున్నారు. పీటీ వారెంట్ లో భాగంగా.. భవానిపురం పోలీసులు కర్నూలు జిల్లా జైలు నుండి విజయవాడ కోర్టుమందు హాజరు పరిచే అవకాశం ఉంది. భవానిపురం పోలీస్ స్టేషన్ లో కీలకమైన కేసు కావడంతో పిటి వారెంట్ దాఖలు చేశారు.
Also Read : కొడాలి నానీ అక్రమాలపై గురి పెట్టినట్టేనా…?
కోర్టులో హాజరు పరిచిన తర్వాత రిమాండ్ విధించే అవకాశం ఉంది. కోర్టు రిమాండ్ విధిస్తే విజయవాడ జైలుకు పోసాని కృష్ణ మురళిని తరలించే అవకాశం ఉంది. కోర్టు రిమాండ్ విధించని పక్షంలో మరోసారి కర్నూలు జైలుకు తీసుకెళ్లే అవకాశాలున్నాయి. ఇక అనంతపురం జిల్లాలోని సింగనమల నియోజకవర్గం లో కూడా రెండు కేసులు పోసాని కృష్ణ మురళి పై నమోదయ్యాయి. దీనితో కర్నూలు నుంచి పోసానిని అనంతపురం తీసుకెళ్లే అవకాశం ఉండవచ్చు. ఒకవేళ భవానిపురం పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో రిమాండ్ విధిస్తే.. విజయవాడ జైలు నుంచి అనంతరం.. అనంతపురం తీసుకెళ్లే అవకాశాలు ఉండొచ్చు.