Friday, September 12, 2025 09:05 PM
Friday, September 12, 2025 09:05 PM
roots

విశాఖలో తోడళ్ళుళ్ళ సందడి.. నేషనల్ మీడియాలో హాట్ టాపిక్..!

ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం విడిపోయిన తోడల్లుళ్ళు వాళ్ళిద్దరూ.. ఆ తర్వాత కలిసింది లేదు.. మాట్లాడింది లేదు.. కనీసం ఒకరి ముఖం ఒకరు చూసుకున్న సందర్భమూ లేదు. కానీ సడెన్ గా… ఆ ఇద్దరూ కలిసి నవ్వుకోవడం, ఆ ఇద్దరూ సరదాగా మాట్లాడుకోవడం.. ఒకరిపై ఒకరు జోకులు వేసుకోవడం… ఒకరినొకరు అభిమానంగా కౌగిలించుకోవడం.. ఇదంతా చాలా మందికి కొత్తగా.. చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఈ తరానికి పెద్దగా ఆ పరిణామాలు తెలియదు. ఓ రాజకీయ పార్టీ వేదికగా ఓ కుటుంబం చీలిపోయిన ఘటనల గురించి ఎప్పుడూ ఏదో ఒక కథనం వస్తూనే ఉంటుంది.

Also Read: అసలు హోదా కోసమే ఎందుకు ఇంత గోల..?

ఇప్పుడు ఆ ఇద్దరే తెలుగు మీడియాలో హాట్ టాపిక్. ఆ ఇద్దరే ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు. టీడీపీ.. చంద్రబాబు ఆధీనంలోకి వచ్చిన తర్వాత ఆ ఇద్దరూ కలవలేదు. చంద్రబాబు కి వ్యతిరేకంగా దగ్గుబాటి ఒక పుస్తకమే రాశారు కూడా. కానీ ఇప్పుడు దగ్గుబాటి రాసిన “ప్రపంచ చరిత్ర” పుస్తకావిష్కరణ పుణ్యమా అని కలిసారు. దగ్గుబాటి రచించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు హాజరు అయ్యారు. నందమూరి, నారా కుటుంబాలు మొత్తం విశాఖలోనే ఈ కార్యక్రమానికి హాజరు అయ్యాయి. ఈ సభలో చంద్రబాబు నాయుడు.. దగ్గుబాటిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Also Read: కూటమి కసరత్తు.. ఎమ్మెల్సీ కుంపటిలో టీడీపీ

ఆయన లైఫ్ స్టైల్ గురించి, వ్యక్తిత్వం గురించి తనకి తెలిసిన పలు విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. అతిరథ మహారధులకు వేదికగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకావిష్కరణ సభ.. ఆద్యంతం సందడి సందడిగానే సాగింది. చంద్రబాబుకు ఇష్టమైన టెక్నాలజీ, చాట్-జీపీటీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు దగ్గుబాటి. దగ్గుబాటి జోవియల్ నెస్ గురించి సోదాహరణంగా వివరించారు చంద్రబాబు. కేంద్ర, రాష్ట్ర ఆర్థిక మంత్రులిద్దరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం మరో విశేషం. ఆద్యంతం నవ్వులతో చమత్కారాలతో సాగిన పుస్తకావిష్కరణ సభ.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్