ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల విషయంలో తెలుగుదేశం పార్టీ ఒక స్పష్టతకు రాలేకపోతోంది. ఆశావాహులు చాలామంది ఉండటంతో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో సీటు రాని నేతల కోసం చంద్రబాబు నాయుడు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే సామాజిక వర్గాల పరంగా కూడా చంద్రబాబు నాయుడు ఈసారి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
Also Read: మళ్ళీ దేవినేని వర్సెస్ వంగవీటి.. ఎవరు నిలుస్తారో…?
ముఖ్యంగా 2024 ఎన్నికల్లో సీటు రాని బీసీ నేతలు దాదాపుగా 30,40 మంది ఉన్నారు. వాళ్లలోనే అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఈసారి బిజెపికి అవకాశం లేనట్లే అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇప్పటికే జనసేన పార్టీ నుంచి నాగబాబు అభ్యర్థిగా ఖరారు అయిపోయారు. ఆయన అభ్యర్థిత్వాన్ని పదిమంది శాసనసభ్యులు ఆమోదించారు. ఇక టిడిపి విషయంలోనే ఆశవాహులు ఎక్కువగా ఉండటంతో చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరితోను ఫోన్లో మాట్లాడుతున్నారట.
Also Read: వివేకా కేసు.. మరో పరిటాల రవి కేసు అవుతోందా…?
నారా లోకేష్ కూడా ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా పడుతున్నారు. పార్టీలో అసంతృప్తి రాకుండా నేతలను బుజ్జగించే విషయంలో లోకేష్ బాధ్యత తీసుకున్నట్టు తెలుస్తోంది. 2019 నుంచి 2024 వరకు ఇబ్బందులు పడిన నేతలు పైన ఎక్కువగా పార్టీ అధిష్టానం దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే కొంతమంది పార్టీ కోసం భారీగా ఖర్చు చేశారు. వారికి కూడా ఎన్నికల్లో సీటు రాలేదు. దీనితో వారిపై ఎక్కువగా చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. వలసనేతల విషయంలో మాత్రం ఈసారి టిడిపి కఠినంగానే వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని, టిడిపి క్యాడర్ మనోభావాలను దృష్టిలో పెట్టుకుని అడుగులు వేసే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు.




