ఏపీ మాజీ సిఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టిన జగన్.. సిఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యంగా తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలపై కూటమి నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా దీనిపై మంత్రి నారా లోకేష్ రియాక్ట్ అయ్యారు. అహంకారానికి ఫ్యాoటు, షర్టు వేస్తే అది జగన్మోహన్ రెడ్డే అంటూ ఎద్దేవా చేసారు. జగన్ ఫ్రస్టేషన్ లో ఉన్నాడని అర్ధమవుతోందన్నారు లోకేష్.
Also Read : రాజ్యసభ సీటుపై కూటమి సంచలన నిర్ణయం…?
అధికారంలో ఉన్నప్పుడు, అధికారం కోల్పోయాక కూడా ప్రజలకు దూరంగా బతుకుతున్నాడని పరదాల ప్రభుత్వం పోయాక రాష్ట్రంలో పరదాల సేల్స్ తగ్గాయట అంటూ ఎద్దేవా చేసారు. ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిర్ణయించారనే విషయం ఎందుకు అర్ధం కావట్లేదు అని నిలదీశారు. సొంత తల్లీ, చెల్లీ తనని నమ్మట్లేదని ఇంకా ఎందుకు గ్రహించలేకపోతున్నాడు అని ప్రశ్నించారు. తండ్రి శవాన్ని పక్కనపెట్టుకుని ముఖ్యమంత్రి కోసం సంతకాలు చేసిన వ్యక్తి జగన్ అని మండిపడ్డారు లోకేష్.
Also Read : రేవంత్ బీజేపీలోకి వచ్చెయ్.. ఎంపీ సంచలన కామెంట్స్
ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు ని కించపరిచేలా మాట్లాడతాడా ? అని నిలదీశారు లోకేష్. 5 ఏళ్లు ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించని జగన్ కు దానిపై మాట్లాడే హక్కు ఎక్కడిది అని ప్రశ్నించారు. ఎందుకు 11 సీట్లు వచ్చాయో ఇప్పుడైనా ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిదని హితవు పలికారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వచ్చిన మెజారిటీ ఎంత ? జగన్ కు వచ్చిన మెజారిటీ ఎంత? అని నిలదీశారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి లపై జగన్ వి దిగజారుడు మాటలు అని ఆగ్రహం వ్యక్తం చేసారు.