Friday, September 12, 2025 09:05 PM
Friday, September 12, 2025 09:05 PM
roots

అమ్మో వారెంట్.. వైసీపీ నేతల గుండెల్లో రైళ్ళు

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతలకు ఇప్పుడు పీటీ వారెంట్ భయం మొదలైంది. ఎప్పుడు.. ఎవరిని అరెస్టు చేస్తారో అర్థం కాక వైసీపీ నేతలు ఒక పక్క భయపడుతుంటే.. పీటీ వారెంట్ వారెంట్ వ్యవహారం కేసులు ఉన్న వైసీపీ నేతలను బాగా ఇబ్బంది పెడుతోంది. తాజాగా సినీనటుడు పోసాని కృష్ణ మురళి పై వరుస కేసులు నమోదు అయ్యాయి. ముందు ఆయనను అరెస్టు చేసినప్పుడు రాజంపేట జైలుకు తరలించిన పోలీసులు.. నరసరావుపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడంతో నరసరావుపేట కోర్టులో ఆయన్ను హాజరు పరిచారు.

Also Read : దువ్వాడకు డీజే మోత ఖాయమా..?

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను పోసాని కృష్ణ మురళి పై కేసు నమోదు చేశారు 153 ఏ 67 యాక్ట్ 504 సెక్షన్ల కింద ఆయన పై కేసు నమోదయింది. ఈ క్రమంలో ఆయనను పిటి వారెంట్ తో నరసరావుపేట.. పోలీసులు రాజంపేట సబ్ జైలుకు వెళ్లారు. రాజంపేట సబ్ జైల్లో పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం పోసానిని నరసరావుపేట పోలీస్ లకు అప్పగించారు. ఇక నరసరావుపేట కోర్టులో ఆయనకు రిమాండ్ విధించడంతో గుంటూరు జైలుకు తరలించారు.

Also Read : గతం మర్చిపోయి పరువు పోగొట్టుకున్న వైసీపీ ఎమ్మెల్యే..!

ఇక బాపట్లలో మరో కేసు నమోదు కావడంతో పీటీ వారెంట్ దాఖలు చేసి ఒకటి రెండు రోజుల్లో బాపట్ల కోర్టుకు తీసుకు వెళ్ళనున్నారు. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆయనపై రెండు కేసులు నమోదయ్యాయి. బాపట్ల కేసులో రిమాండ్ విధిస్తే ఇక్కడి నుంచి పీటీ వారెంట్ తో ఆయనను చిత్తూరు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత నర్సీపట్నంలో ఆయనపై మరో కేసు నమోదు అయింది. చిత్తూరు తర్వాత నర్సీపట్నం తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిని గమనిస్తున్న వైసీపీ కార్యకర్తలు, కొంతమంది నాయకులు.. తమపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం గట్టిగానే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

Also Read : ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ కవర్ డ్రైవ్..!

సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి కిందిస్థాయి నేతల వరకు అందరూ ఇప్పుడు ముందస్తు బెయిల్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీ హయాంలో రెచ్చిపోయిన వాళ్ళందరికి పిటి వారంట్ దెబ్బ గట్టిగానే పడే అవకాశం స్పష్టంగా కనబడుతోంది. ఒకప్పుడు టిడిపి నేతలను వైసీపీ హాయంలో పోలీసులు అదుపులోకి తీసుకుంటే ఒక కేసులో మాత్రమే జైల్లో ఉంచి ఇబ్బందులు పెట్టేవారు. ఇక ఆ జైలు నుంచి బయటికి వచ్చేలోపు మరో కేసు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేశారు. ఇప్పుడు పీటీ వారెంట్ తో బూతుల బ్యాచ్ కు చట్టం రుచి చూపిస్తున్నారు ఏపీ పోలీసులు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్