అసెంబ్లీ ముగిసిన తర్వాత అసెంబ్లీ కమిటీ హాల్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం శాసనసభ పక్షం సమావేశం మొదలయింది. 2025-26వార్షిక బడ్జెట్ కు అభినందనలు తెలిపిన టీడీఎల్పీ.. అసెంబ్లీ లో చర్చించాల్సిన అంశాలు, ఆమోదించాల్సిన బిల్లులు తదితర అంశాలపై చర్చించింది. దాదాపు 20కి పైగా అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంది టీడీఎల్పీ. తెలుగుదేశం శాసనసభాపక్ష సమావేశంతో పాటు పార్లమెంటరీ పార్టీ సమావేశం కూడా చంద్రబాబు నిర్వహించనున్నారు.
Also Read : టైటిల్ ప్లాన్ మారింది.. జక్కన్న ప్లానింగ్ వేరే లెవెల్
కేంద్రం నుంచి రాష్ట్రానికి తెచ్చే నిధుల అంశమై మంత్రులు-ఎంపీల మధ్య సమన్వయం పై చర్చ జరగనుంది. టీడీఎల్పీ లో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. నాయకత్వ లక్షణాలను ఎప్పటికప్పుడు పెంపొందించుకోవాలని సూచించారు. కొన్ని సందర్భాల్లో మంచి చేసి కూడా మనం చెప్పుకోలేకపోతున్నామన్నారు సిఎం. వాళ్ళ బాబాయ్ ని హత్య చేసి నారాసుర రక్త చరిత్ర పేరుతో తనకు అంటించే ప్రయత్నం చేశారని.. రాష్ట్ర విభజన సమయంలో కూడా నన్ను ఇబ్బంది పెట్టాలని చాలామంది చూశారన్నారు.
Also Read : ఏపీ బడ్జెట్ హైలెట్స్.. సంచలనాలు ఇవే
నాపై ఆనాడు తప్పుడు ప్రచారం చేశారని చంద్రబాబు వ్యాఖ్యలు చేసారు. 2013 ఆత్మగౌర యాత్ర సంఘటన విషయాలు నేతతో పంచుకున్నారు సీఎం చంద్రబాబు. 2013లో నేను ఆంధ్ర పర్యటనకు వస్తానంటే మన పార్టీ నాయకులే వద్దన్నారని.. కానీ ఆనాడు నా నిర్ణయాన్ని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అమలు చేశారని.. ఆత్మ గౌరవ యాత్ర ద్వారా 2014లో అధికారంలోకి వచ్చామన్నారు. అప్పుడు ప్రత్యర్థుల కుట్రలను కూడా యరపతినేని సమర్థవంతంగా తిప్పి కొట్టారని కొనియాడారు. ఆనాడు ఆత్మగౌరవ యాత్ర పొందుగల నుంచి ప్రారంభించినప్పుడు యరపతినేని శ్రీనివాసరావు పూర్తి సహకారం అందించాడని కొనియాడారు.