Friday, September 12, 2025 10:37 PM
Friday, September 12, 2025 10:37 PM
roots

ఆ ఒక్క అరెస్ట్ ఎందుకు ఆగుతున్నట్టు…?

ఆంధ్రప్రదేశ్ లో గత ఐదేళ్లపాటు రెచ్చిపోయిన వాళ్ళను ఇప్పుడు ఒక్కొక్కరిని పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. వారి అవినీతి అక్రమాల వ్యవహారాలను ఒక్కొక్కటిగా బయటకు లాగుతూ కేసులు నమోదు చేస్తున్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, సినీ నటుడు పోసాని కృష్ణ మురళి సహా పలువురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఒక అరెస్టు కోసం రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు ఎదురుచూస్తున్నారు. అదే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Also Read : వంశీ అరెస్ట్ పై పోలీసులు సంచలన కామెంట్స్

చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని లేకుండా చేయాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ హయంలో పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. కనీసం స్థానిక సంస్థలు ఎన్నికలను కూడా అక్కడ నిర్వహించలేని పరిస్థితి అప్పట్లో తీసుకొచ్చారు. నామినేషన్లు వేసేవాళ్లను కూడా బెదిరించారు. కనీసం ఆయన నియోజకవర్గంలో సర్పంచ్ గా పోటీ చేయాలన్నా సరే భయపడిపోయిన పరిస్థితి ఏర్పడింది. అలాగే అవినీతి అక్రమాల విషయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అందరికంటే ముందున్నారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్దన్నాయి.

Also Read : పోసాని రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు

మదనపల్లి ఫైల్స్ కేసులో ఆయనను పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది. అలాగే అటవీ భూములను ఆక్రమించుకొని అక్కడ ఫామ్ హౌస్ కూడా నిర్మించారనే సాక్ష్యాలు కూడా బయటికి వచ్చాయి. అయినా సరే ఇప్పటివరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మాత్రం అరెస్టు చేయలేదు. చిన్నచిన్న వాళ్ళను కాదని పెద్దవాళ్ళను కూడా అరెస్టు చేయాలంటూ టిడిపి నేతలు డిమాండ్ చేస్తున్నారు. చేస్తున్న అరెస్టులు కరెక్టే గాని పెద్దవాళ్ళను కూడా అరెస్టు చేయాలని.. ముఖ్యంగా పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి సీఎం చంద్రబాబునే అప్పట్లో టార్గెట్ చేశారు.. కాబట్టి ఆయనపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని కోరుతున్నారు. ఇటీవల కూడా పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాస్త రెచ్చిపోయి వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్