గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ వ్యవహారంలో పోలీసులు పక్కా ఆధారాలతో ముందుకు వెళ్తున్నారు. ఈ వారంలో ఆయనపై నాలుగు కేసులు నమోదు చేసారు పోలీసులు. ఇక మూడు రోజుల పాటు వంశీని కస్టడీలోకి తీసుకోగా ఆయన వద్ద నుంచి పోలీసులు ఏ సమాచారాన్ని రాబట్టలేదు అని తెలుస్తోంది. ఇక తాజాగా వైద్య పరిక్షల అనంతరం వల్లభనేని వంశీమోహన్ ను జిల్లా జైలుకు తరలించారు పోలీసులు. ఈ సందర్భంగా ఏసీపీ దామోదర్ వంశీ కేసు విషయంలో ఆసక్తికర కామెంట్స్ చేసారు.
Also Read : పండుగనాడు కూడా ప్రాంతీయ విద్వేషమేనా కవితక్కా..?
సత్యవర్ధన్ ను బెదిరించి, భయపెట్టి కేసు తారుమారు చేయాలని చూశారు అని.. వంశీ, అతని అనుచరులు సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయి అని వ్యాఖ్యానించారు. సిసి కెమెరా పుటేజీ, సాంకేతిక పరమైన ఆధారాలు సేకరించామని తెలిపారు. కోర్టు ఆదేశాలతో మూడు రోజుల కస్టడీ లో వంశీని ప్రశ్నించామని… కొన్నింటికి అవును అని చెప్పిన వంశీ.. మరి కొన్నింటికి సమాధానాలు చెప్పలేదన్నారు. మిస్ అయిన ఫోన్ గురించి అడిగినా తనకు తెలియదు అన్నారని పోలీసులు పేర్కొన్నారు. ఈనెల 12న హైదరాబాద్ నుంచి వచ్చి జగన్ ను కలిసినట్లు వంశీ అంగీకరించారన్నారు.
Also Read : పసికూన కాదు.. ఆశ్చర్యపరిచిన ఆఫ్ఘన్ క్రికెట్…!
మాకు ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉందని పేర్కొన్నారు. మరోసారి కస్టడీ కావాలని పిటీషన్ వేస్తామన్న ఏసీపీ జైలులో ఒక బ్యారక్ కాకుండా ఇతరులు ఉన్బ బ్యారక్ అడిగారు అని అది జైలర్, వంశీ కోర్టు లో పిటిషన్ వేసి విచారణ చేపడతారని పేర్కొన్నారు. కేసులో ఇతర ముద్దాయి లను కూడా కస్టడీ కోరుతూ ఇప్పటికే పిటిషన్ వేశామన్నారు. ఇక కోర్ట్ ముందు వంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తనకు ఎటువంటి థ్రెట్ లేదని కాబట్టి మిగతా ఖైదీలతో కలిపి ఉంచాలని కోరారు. తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని… ఇన్చార్జి కోర్టు కావడంతో సంబంధిత కోర్టులో అన్ని వివరాలను తెలుపుతూ మెమో రూపంలో దాఖలు చేయాలని కోర్ట్ వంశీకి సూచించింది.