Friday, September 12, 2025 07:23 PM
Friday, September 12, 2025 07:23 PM
roots

జీవీ రెడ్డికి అధిష్ఠానం పిలుపు.. పదవి ఖాయమా..?

ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపిన నేత గొలమారి వెంకటరెడ్డి. నాలుగేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిన జీవీ రెడ్డిని జాతీయ అధికార ప్రతినిధిగా నియమించారు చంద్రబాబు. నాటి నుంచి వైసీపీ ప్రభుత్వంపై జీవీ రెడ్డి పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇక ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వంలో పార్టీ కోసం కష్టపడిన జీవీ రెడ్డిని ఏపీ ఫైబర్‌నెట్ లిమిటెడ్ కార్పొరేషన్ చైర్మన్‌గా చంద్రబాబు నియమించారు. అయితే సంస్థ మాజీ ఎండీ దినేష్ కుమార్‌తో పాటు మరో ముగ్గురు ఉన్నతాధికారులు ఏ మాత్రం ప్రభుత్వానికి సహకరించడం లేదని జీవీ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. చివరికి చైర్మన్ ఆదేశాలు కూడా లెక్క చేయటం లేదని తీవ్ర మనస్తాపంతో చైర్మన్ పదవితో పాటు పార్టీ పదవులకు కూడా జీవీ రెడ్డి రాజీనామా చేశారు.

Also Read : బీఆర్ఎస్ కు నిద్ర లేకుండా చేస్తున్న రేవంత్ టూర్

అయితే జీవీ రెడ్డికి పార్టీలో కింది కార్యకర్త మొదలు ప్రతి ఒక్కరు మద్దతుగా నిలిచారు. జీవీ రెడ్డి వంటి నేతలు పార్టీకి ఎంతో అవసరమంటూ సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుతో పాటు లోకేష్‌ను విజ్ఞప్తి చేశారు. అయితే చంద్రబాబు మాత్రం ఏపీ ఫైబర్‌నెట్ లిమిటెడ్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి చేసిన రాజీనామాను వెంటనే ఆమోదించారు. దీనిపై కొందరు పార్టీ నేతలు విమర్శలు కూడా చేశారు. ప్రజల దీంతో జీవీ రెడ్డి పార్టీకి చేసిన రాజీనామాను ఇప్పటి వరకు జాతీయ అధ్యక్షులు ఆమోదించలేదు. జీవీ రెడ్డి వ్యవహారంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్.. మొత్తం వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని సంబంధిత శాఖ మంత్రిని కోరినట్లు తెలుస్తోంది. అలాగే తన తరఫున జీవీ రెడ్డితో మాట్లాడేందుకు కొందరిని పంపినట్లు సమాచారం.

Also Read : యనమల గేమ్.. ఈసారి గెలుపు సులభమే..!

జీవీ రెడ్డిని పెద్దల సభకు పంపాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో ఏపీలో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటికి ఇప్పటికే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది కూడా. ఈ స్థానాలన్నీ కూటమి ప్రభుత్వం ఖాతాలోకే చేరనున్నాయి. వీటిల్లో ఒకటి జనసేనకు, మరొకటి బీజేపీకి కేటాయించి… మిగిలిన 3 స్థానాలను టీడీపీ సొంతం చేసుకునేందుకు ఇప్పటికే ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. 3 స్థానాలను ఎవరికివ్వాలనే అంశం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే జీవీ రెడ్డికి మాత్రం ఈ దఫా కాకుండా… వచ్చే దఫాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని లోకేష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి చంద్రబాబు కూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఇదే విషయంపై జీవీ రెడ్డితో చర్చించిన తర్వాత… అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి జీవీ రెడ్డి ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది.

సంబంధిత కథనాలు

1 COMMENT

  1. జి.వి రెడ్డి గారు, స్వార్ధ పరమైన రాజకీయాలకు మీరే ప్రక్షాళన ప్రారంభించండి…u టర్న్ తీసుకోకండి…..మీ నిజాయతీ ని ఎక్కడ తగ్గించుకోకండి….స్వార్ధ రాజకీయ నాయకులు,వాళ్ళకి తొత్తులు గా మారిన ఐ.ఏ.స్ లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు……

Comments are closed.

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్