తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారో కూడా.. ఎవరికి అర్థం కాని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ముఖ్యమంత్రి అయినా సరే బిజెపి పెద్దలతో ఆయన దగ్గరగా ఉండటాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా జీర్ణించుకోలేకపోతోంది. రేవంత్ రెడ్డికి అన్ని విధాలుగా అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.. ఇటీవలి కాలంలో జరుగుతున్న పరిణామాలను ఆసక్తికరంగా గమనిస్తోంది. ఇటీవల రేవంత్ రెడ్డిని కలిసేందుకు ఎంపీ రాహుల్ గాంధీ ఆసక్తి చూపించలేదు. దీనితో రేవంత్ కు అపాయింట్మెంట్ కూడా దక్కలేదు.
Also Read : ఒంగోలులో ఖాళీ అయిపోతున్న వైసీపీ
అయితే తాజాగా రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. సాధారణంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రి మోడీ అపాయింట్మెంట్ ఇవ్వరు అనేది ఎప్పటినుంచో ఉన్న ఆరోపణ. చివరకు ఎన్డియే పాలిత సీఎంలకు కూడా ఇవ్వరు. కానీ రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం ఇది భిన్నంగా జరిగింది. ఇక తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కూడా రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓడినా.. గెలిచినా తనకేమీ ఇబ్బంది లేదు అంటూ చాలా ధీమాగా మాట్లాడారు.
Also Read : అధ్యక్ష అంటావా.. ఇంట్లో ఉంటావా..?
ఇక వెంటనే ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు ఆయన ఢిల్లీ పర్యటన వెళ్లడం.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో అత్యంత సన్నిహితంగా కనపడటంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాక కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇక రాష్ట్రంలో గులాబీ పార్టీ అయితే కలవర పడిపోతుంది. ఇప్పుడిప్పుడే బీజేపీ పెద్దలకు దగ్గర కావాలని ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఇటువంటి పరిణామాలను ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. మరి త్వరలో రేవంత్ రెడ్డి ఏమైనా సంచలనాలకు తెర తీస్తారా అనేది అర్థం కాని పరిస్థితి. అటు కేంద్ర మంత్రులు కూడా రేవంత్ రెడ్డికి మంచి ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం.