హనుమాన్ సినిమాతో తాను ఏంటి అనేది ప్రూవ్ చేసుకున్న యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీ గా గడిపేస్తున్నాడు. చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు ప్రతి ఒక్కరికి స్టోరీలు రెడీ చేసుకుంటూ బిజీగా ఉన్నాడు ఈ యంగ్ డైరెక్టర్. అయితే ఎప్పుడు ఏ సినిమా అనౌన్స్ చేస్తాడో అర్థం కాక జనాలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ప్రస్తుతం నందమూరి మోక్షజ్ఞతో ఇతను సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఎక్కడ వరకు వచ్చింది.. ఏంటి అనే దానిపై ఇప్పటివరకు క్లారిటీ లేదు.
Also Read : మళ్ళీ పవన్ తో సున్నం పూసుకుంటున్న వైసీపీ
అయితే సినిమా ఆగిపోయింది అనే ప్రచారం మాత్రం గట్టిగా జరుగుతోంది. కానీ సినిమా ఎక్కడా ఆగలేదని, సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ బయటకు వస్తుందని ప్రశాంత్ వర్మ ఆఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. ఇక ఇప్పుడు ప్రభాస్ తో ఒక సినిమాను మొదలు పెడుతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో ఒక టాక్ మొదలైంది. బ్రహ్మరాక్షస్ అనే సినిమాను.. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ తో చేయాలనుకుని ప్లాన్ చేసాడు. ఆ సినిమా ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది అనుకున్న టైంలో ఆగిపోయింది. ఇక ఇప్పుడు అదే కథను ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు మారుస్తున్నాడు.
Also Read : కారు స్టీరింగ్ పట్టుకునేది ఎవరు..?
ఆ సినిమాను ముందుకు తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే హైదరాబాదులో దీనికి సంబంధించి లుక్ టెస్ట్ కూడా రెడీ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఈ సినిమాను ఎవరు నిర్మిస్తారు అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. అయితే హోంబలే ఫిలిమ్స్.. ఈ సినిమాను నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ సినిమా మొదలుపెడితే మోక్షజ్ఞతో చేసే సినిమా సంగతి ఏంటి అనేదానిపై మాత్రం క్లారిటీ రావడం లేదు. ప్రశాంత వర్మ మాత్రం సినిమాలు అనౌన్స్ చేయడం.. వాటిని పక్కన పెట్టడం వంటివి ఈమధ్య ఎక్కువగా వినపడుతున్నాయి. దీనితో ప్రభాస్ సినిమా అయినా ముందు వెళ్తుందా లేదా అనేది క్లారిటీ లేదు. ఇక ప్రభాస్ మరో రెండు మూడు సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు.