Friday, September 12, 2025 09:03 PM
Friday, September 12, 2025 09:03 PM
roots

పవన్ పై లోకేష్ ప్రసంశలు..

గవర్నర్ ప్రసంగంపై మంత్రి లోకేష్ మండలిలో వివరణ ఇచ్చారు. ప్రభుత్వ స్కూల్ ఒక్కటీ కూడా మూయకూడదు అని ఆదేశాలు ఇచ్చామని నీట్ స్కూల్స్ కూడా ప్రారంభిస్తున్నాం అన్నారు. స్కూల్స్ లో టీచర్ లకు చాలా కమిట్మెంట్ ఉందని గత ప్రభుత్వం లో టీచర్లను చాలా ఇబ్బంది పెట్టారన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ వీసీ..ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లు ఇద్దరు వైసిపి కార్యకర్తలుగా పనిచేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వీసీల అద్భుతమైన వ్యక్తులు అని మంత్రి కొనియాడారు.

Also Read : కూటమి సర్కార్‌కు ఝలక్.. జీవీ రెడ్డి రాజీనామా..!

జేఎన్టీయూకి వీసీ గా నియమించిన వ్యక్తి ఎన్ ఐ టి వరంగల్ నుండి వచ్చారని యోగి వేమన యునివర్సిటీ కి ప్రకాష్ బాబు హైదరబాద్ యునివర్సిటీ నుండి వచ్చారన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా సభ్యులు మాట్లాడారు అని కేంద్ర ప్రభుత్వ సహకారం రాష్ట్రానికి చాలా అవసరం అన్నారు లోకేష్. దేశంలో అన్ని పరిశ్రమలు ప్రైవేట్ పరం జరుగుతున్న తరుణంలో విశాఖకి కేంద్రం సహకారం అందించిందని విశాఖ ఉక్కు కోసం తాను వెంటపడ్డాను అన్నారు లోకేష్. సిఎం కి కూడా చెప్పాము సాధించాలని అని తెలిపారు.

Also Read : బాక్సాఫీస్ వద్ద ఛావా సునామీ.. ఈ వీకెండ్ కూడా సెన్సేషన్..!

గత ప్రభుత్వంలో పోలవరం నిర్మాణం జరిగింది ఒక 5శాతం మాత్రమే అని కేంద్ర పోలవరానికి కూడా సహకారం అందిస్తుందన్నారు. పవన్ అన్న ఆధ్వర్యంలో అద్భుతంగా గ్రామ సభలు జరిగాయన్నారు. దారి తప్పిన జలజీవన్ మిషన్ ని కూడా పవన్ కళ్యాణ్ కేంద్రంతో మాట్లాడి తీసుకొచ్చారని తెలిపారు. గ్రూప్2 విషయంలో అందరం లేఖలు రాసిన ఏపీపీఎస్సీ చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు పరీక్షలు నిర్వహించారని తెలిపారు. ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అనేది చూడాలని అందరికీ ఆకాంక్షగా ఉంటుంది నేను కూడా వెళ్లాను దానిపైన కూడా విమర్శలు చేస్తున్నారన్నారు.

Also Read : ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు వీళ్ళే..?

ఐసీసీ చైర్మన్ ని కలిశాను.. అహ్మదాబాద్ స్టేడియం తర్వాత అతిపెద్ద స్టేడియం అమరావతి లోనే కడదామని కలిసి పనిచేద్దాం అన్నారని తెలిపారు. అహ్మదాబాద్ స్టేడియన్ని ఎలా కట్టారు అనేది క్లియర్ గా తనకు వివరించారు అని అహ్మదాబాద్ స్టేడియం అనేది ఒక క్రికెట్ గా కాకుండా మిగిలిన క్రీడలకు కూడా ఉపయోగిస్తున్నామని చెప్పారని లోకేష్ పేర్కొన్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్