ఆంధ్రప్రదేశ్ లో 5 ఎమ్మెల్సీ స్థానాల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో ఇప్పుడు సీట్ల విషయంలో పెద్ద చర్చ జరుగుతుంది. జనసేన పార్టీ నుంచి నాగబాబు, బీజేపీ నుంచి మాధవ్, తెలుగుదేశం పార్టీ నుంచి వంగవీటి రాధ. కేఎస్ జవహర్, పిఠాపురం వర్మ పోటీ చేయడం దాదాపుగా ఖాయంగానే కనపడుతుంది. అసెంబ్లీలో టీడీపీకి బలం ఉండటంతో ఖచ్చితంగా వీళ్ళు విజయం సాధించడం ఖాయం. అయితే ఇక్కడ దేవినేని ఉమాకు సీటు వస్తుందా లేదా అనేది క్లారిటీ రావటం లేదు.
Also Read : గెలిపించుకుని రండి.. మంత్రులకు చంద్రబాబు టార్గెట్
2024 ఎన్నికల్లో పార్టీ అధిష్టానం ఆయనను పక్కనపెట్టి మైలవరం నియోజకవర్గం నుంచి వసంత కృష్ణ ప్రసాద్ కు అవకాశం కల్పించింది. అప్పటినుంచి దేవినేని ఉమా పార్టీ కోసం కష్టపడినా.. పదవులు కోసం ఎదురుచూస్తున్నారు. వైసిపి అధికారంలో ఉన్న సమయంలో ఉమా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అనూహ్యంగా నియోజకవర్గం నుంచి వసంత కృష్ణ ప్రసాద్ కు సీటు ఖరారు చేయడంతో ఆయన సైలెంట్ అయ్యారు. గత ఏడాది బుడమేరు వరదల సమయంలో కూడా దేవినేని ఉమా గట్టిగానే కష్టపడ్డారు.
Also Read : బిజెపిలో ఆ ఇద్దరే దొంగలు.. రేవంత్ సంచలన కామెంట్స్
అయినా సరే ఆయనకు పార్టీ అధిష్టానం నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వలేదు. ఆర్టీసీ చైర్మన్ పదవి విషయంలో ఆయన పేరు ప్రముఖంగా వినపడింది. అలాగే ఏపీ ఫైబర్ నెట్ విషయంలో కూడా ఆయన పేరు వినిపించింది. కానీ దేవినేని ఉమామ విషయంలో పార్టీ అధిష్టానం సానుకూలంగా లేదని, అందుకే ఆయనకు ఏ పదవులు ఇవ్వడం లేదని కార్యకర్తల్లో చర్చ జరుగుతుంది. ఈ తరుణంలో వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన పేరును పరిశీలిస్తారా లేదా అనేది ప్రధాన చర్చ.
Also Read : కూటమి సర్కార్‌కు ఝలక్.. జీవీ రెడ్డి రాజీనామా..!
కృష్ణ, గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ స్థానానికి ఆయన పేరును ఖరారు చేసే అవకాశం ఉందని అంచనా వేశారు. కానీ ఆలపాటి రాజాను చంద్రబాబు నాయుడు ఫైనల్ చేశారు. ఇక ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు సీటు ఇస్తారా లేదా అనేది స్పష్టత రావడం లేదు. ఉమా కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. నియోజకవర్గంలో కూడా ఆయన పెద్దగా యాక్టివ్ గా తిరగడం లేదు. కేవలం తన కార్యాలయానికి మాత్రమే పరిమితం అయిపోయారని నియోజకవర్గంలో టాక్ వినపడుతోంది.