Friday, September 12, 2025 10:54 PM
Friday, September 12, 2025 10:54 PM
roots

ఇలా అయితే కష్టమే అంటున్న తమ్ముళ్లు..!

గొలమారి వెంకటరెడ్డి.. ఈ పేరు ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ జీవీ రెడ్డి అంటే మాత్రం అందరికీ తెలుసు. ఐదేళ్లుగా తెలుగుదేశం పార్టీ తరఫున వైసీపీ ప్రభుత్వపై పోరాటం చేసిన వ్యక్తి. వైసీపీ ప్రభుత్వ తప్పులను లెక్కలతో సహా సవివరంగా బయట పెట్టిన నేత. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి హోదాలో జీవీ రెడ్డి వైసీపీ సర్కార్‌పై ఒంటి కాలితో పోరాటం చేశారు. కొన్నిసార్లు వైసీపీ నేతలు కూడా కులం పేరుతో జీవీ రెడ్డిని విమర్శించారు కూడా. “మన రెడ్డి సర్కార్‌పైనే విమర్శలు చేస్తావా..” అంటూ వ్యాఖ్యలు కూడా చేశారు. అలాంటీ జీవీ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో సంచలనంగా మారింది. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన ఓ ఆడిటర్ కుమారుడు… ఎలాంటి రాజకీయ నేపథ్యంలేని కుటుంబం నుంచి తెలుగు రాష్ట్రాల్లో కీలక పదవి నిర్వహించే స్థాయికి ఎదిగారు. అయితే స్వశక్తితో పైకి వచ్చిన జీవీ రెడ్డి తీసుకున్న నిర్ణయం… ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Also Read : గెలిపించుకుని రండి.. మంత్రులకు చంద్రబాబు టార్గెట్

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు వస్తాయని అంతా భావించారు. అదే సమయంలో ఐదేళ్ల వైసీపీ పాలనలో తెలుగుదేశం, జనసేన నేతలు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన నేతలు, అధికారులపై చర్యలుంటాయని కూడా తెలుగు తమ్ముళ్లు భావించారు. అయితే ఈ రెండు జరగలేదు. తొలి జాబితాలో పార్టీ కోసం నిజంగా కష్టపడిన వారికి కాకుండా… మాజీలకే ప్రాధాన్యత ఇచ్చారు చంద్రబాబు. ఆ తర్వాత టీడీపీ నేతలను వేధించిన అధికారులకు ఉన్నత పదవులే ఇచ్చారు. దీంతో ఈ విషయాన్ని మొదటగా ప్రస్తావించిన వ్యక్తి జీవీ రెడ్డి. దీంతో సెకండ్ లిస్ట్‌లో పట్టాభి, పొడపాటి తేజస్విని, రవి నాయుడు, మజ్జి పద్మావతి వంటి వారికి పదవులు దక్కాయి. అయితే ఇక్కడ మరో విషయంలో మాత్రం పాత చంద్రబాబే ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులపై చర్యలు తీసుకోవడంలో చంద్రబాబు వెనుకడుగు వేస్తారనేది అతి పెద్ద ఆరోపణ. జీవీ రెడ్డి విషయంలో కూడా ఇదే రుజువైంది.

Also Read : జియో ఫేక్ వ్యూస్..? నిజంగా అంత మంది చూసారా…?

ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ హోదాలో ఇచ్చిన ఆదేశాలను కూడా ఎండీ దినేష్ కుమార్ అమలు చేయలేదు. ఇదే విషయంపై ఎన్నోసార్లు నోటీసులు జారీ చేసినా కూడా ఎండీ కనీసం స్పందించలేదు. పైగా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 8 నెలలవుతున్నా సరే… ఇప్పటికీ పాత ప్రభుత్వంలో నియమించిన వైసీపీ కార్యకర్తలే ఉద్యోగులుగా కొనసాగుతున్నారు. వీరిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని జీవీ రెడ్డి ప్రశ్నించినా కూడా కనీస స్పందన లేదు. దీంతో జీవీ రెడ్డి బహిరంగంగానే ఆరోపణలు చేశారు. ఈ విషయంపై చంద్రబాబు అప్పుడే దృష్టి పెట్టి ఉంటే… జీవీ రెడ్డి లాంటి నిజాయతీ ఉన్న నేత ఇప్పుడు పార్టీకి దూరం అయ్యే పరిస్థితి తలెత్తేది కాదు. ముందుకు ఎండీ దినేష్ కుమార్‌తో కలిసి పని చేయాలని జీవీ రెడ్డికి చంద్రబాబు సూచించారు. ఈ సూచనతో తీవ్ర మనస్థాపానికి గురైన జీవీ రెడ్డి.. పదవికి, పార్టీకి కూడా రాజీనామా చేశారు. దీంతో ఆ వెంటనే దినేష్ కుమార్‌పై బదిలీ వేటు వేశారు చంద్రబాబు. ఆ పనేదో ముందే చేసి ఉంటే… జీవీ రెడ్డి రాజీనామా చేయాల్సి వచ్చేది కాదు కదా అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఆలస్యం.. అమృతం.. విషం.. అనే సామెతను గుర్తు చేస్తున్న తెలుగు తమ్ముళ్లు… కొన్ని విషయాల్లో చంద్రబాబు తీసుకునే నిర్ణయాలు… ఇలా పార్టీకి చేటు కూడా చేస్తాయని వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికైనా తన విధానం మార్చుకోకపోతే కష్టమే అంటున్నారు తెలుుగు తమ్ముళ్లు.

సంబంధిత కథనాలు

1 COMMENT

  1. నిజాయతీ కి పట్టం కట్టి పార్టీ ని బలోపేతం చెయ్యాల్సిన తరుణం లో ఇలాంటి జి.వి.రెడ్డి లాంటి వాళ్ళు బయటకి వెళ్ళిపోతే ప్రజలకు ప్రభుత్వం మీద నమ్మకం పోయి, పార్టీ ని బహిష్కరించే పరిస్థితి వస్తుంది…తస్మాత్ జాగ్రత్త….

Comments are closed.

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్