వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అసెంబ్లీ అధికారులు షాక్ ఇచ్చారు. అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు అసెంబ్లీకి హాజరైన జగన్‌ను అసెంబ్లీ అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదు. ఇంకా చెప్పాలంటే.. ఈ హాజరు అసలు లెక్కలోకే రాదని తేల్చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా తొలిరోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసగించారు. దీనికి ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యారు. ఇక సభ ప్రారంభమైన 11 నిమిషాలకే వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు స్పీకర్ పోడియం వద్ద నినాదాలు చేశారు. ఆ తర్వాత సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించాలని అప్పుడే సభకు వస్తామని బయట తేల్చేశారు. ఇదే సమయంలో 60 రోజుల పాటు సభకు హాజరుకాకపోతే అనర్హత వేటు పడుతుందన్న స్పీకర్, డిప్యూటీ స్పీకర్ వ్యాఖ్యలను గుర్తు చేస్తున్న వైసీపీ నేతలు… సభకు వచ్చాం కదా అంటున్నారు.
Also Read : సభలో 11 నిమిషాలు… చివరికి బాయ్‌కాట్..!
వైసీపీ నేతలకు అసెంబ్లీ అధికారులు షాక్ ఇచ్చారు. వాస్తవానికి అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు మాత్రమే జగన్ తొలిరోజే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. తొలిరోజున గవర్నర్ ప్రసంగం మాత్రమే ఉంటుంది కాబట్టి… ఇతర సభ్యులెవరు మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టి… గతంలో తాము ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన విషయాలు లేవనెత్తే అవకాశం లేదని తొలి రోజు అసెంబ్లీకి వచ్చారు జగన్. కానీ సోమవారం జరిగిన సెషన్ వర్కింగ్ డే కాదంటున్నారు అసెంబ్లీ అధికారులు. పార్లమెంటరీ సాంప్రదాయాల ప్రకారం సమావేశాల ప్రారంభానికి ముందు జరిగే గవర్నర్ ప్రసంగం మాత్రమే అంటున్నారు అధికారులు. గవర్నర్ ప్రసంగాన్ని కస్టమరీ సెషన్ అని స్పష్టం చేశారు. సాంకేతికంగా మంగళవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయని అధికారులు తేల్చేశారు.
Also Read : గెలిపించుకుని రండి.. మంత్రులకు చంద్రబాబు టార్గెట్
స్పీకర్ అధ్యక్షతన జరిగే అసెంబ్లీ సమావేశాన్ని మాత్రమే వర్కింగ్ డేగా పరిగణనిస్తామన్నారు. తొలిరోజు సెషన్‌కు హాజరైనా, అటెండెన్స్‌లో సభ్యులు సంతకాలు చేసినా సరే.. వాటిని పరిగణనలోకి తీసుకోమంటున్నారు అధికారులు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 101 క్లాజ్ 4లో వరుసగా 60 రోజుల పాటు సభ్యుడు సమావేశాలకు హాజరు కాకపోతే సీటు వేకెంట్ అని డిక్లైర్ చేసే అధికారం స్పీకర్‌కు ఉంది. ఈ భయంతోనే తొలిరోజు అసెంబ్లీ సెషన్‌కు జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు అంతా హాజరయ్యారు. అయితే రెండో రోజు నుంచి సమావేశాలకు వెళ్లకూడదని ఇప్పటికే వైసీపీ నేతలు నిర్ణయించింది. దీంతో జగన్ మెడపై 60 రోజుల గైర్హాజరు అనర్హత కత్తి వేలాడుతోందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.