Friday, September 12, 2025 10:56 PM
Friday, September 12, 2025 10:56 PM
roots

ప్రతి విషయానికీ ఆయనేనా… ఇలా అయితే కష్టమే..!

కూటమి ప్రభుత్వంలో ఏ సమస్య వచ్చినా సరే.. అందుకు పరిష్కారం మాత్రం ఒక్కరే చూపిస్తున్నారు. అది రాజకీయ సమస్య అయినా సరే… ఉద్యోగులతో ఇబ్బందులైనా సరే… చివరికి ప్రత్యర్థుల వల్ల ఇబ్బందులైనా సరే.. పరిష్కారం కోసం అంతా ఆయన వైపే చూస్తున్నారు. ఇంకా చెప్పాలంటే… ఆయన జోక్యం చేసుకుంటేనే సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. ఇంతకీ ఆయన ఎవరో కాదు… సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నిజమే… సమస్య చిన్నదైనా… పెద్దదైనా సరే పరిష్కారం మాత్రం స్వయంగా సీఎం పరిష్కరించాల్సి వస్తుంది. దీంతో ప్రభుత్వ పెద్దల తీరుపై కొన్ని విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

Also Read : సోషల్ మీడియా పోస్టులకు ఘాటు కౌంటర్లు..!

అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి పైనే చంద్రబాబు పూర్తిగా ఫోకస్ పెట్టారు. అదే సమయంలో సంపద సృష్టి పై కూడా దృష్టి పెట్టారు. ఇందుకోసం ఇప్పటికే కార్యాచరణ కూడా రూపొందించారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు ప్రారంభమయ్యాయి. ఇక త్వరలోనే అమరావతి నిర్మాణ పనులు కూడా ప్రారంభం కానున్నాయి. ఇక పెట్టుబడుల కోసం బడా సంస్థలతో చంద్రబాబు సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇలాంటి సమయంలో పార్టీ నేతలతో పాటు ప్రభుత్వ పెద్దలు, కొందరు కూటమి నేతలు చేస్తున్న పనులు మాత్రం ఆయనకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. దీంతో సమస్య పరిష్కారానికి స్వయంగా రంగంలోకి దిగుతున్నారు చంద్రబాబు.

Also Read : నేతలకు ముఖ్యమంత్రి క్లాస్..!

రెండు రోజుల క్రితం తిరుమలలో చిరుద్యోగిపై టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ నోరు పారేసుకున్నారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. నరేష్ కుమార్ స్వయంగా క్షమాపణ చెప్పాలని టీటీడీ ఉద్యోగులు పరిపాలన భవనం ఎదుట ఆందోళన చేపట్టారు కూడా. ఒకదశలో నరేష్ కుమార్‌ను బోర్డు నుంచి తొలగించాలని కూడా డిమాండ్ చేశారు. అయితే ఈ వ్యవహారంపై నరేష్ కుమార్ ఏ మాత్రం స్పందించలేదు. అటు బోర్డు కూడా ఈ విషయాన్ని పెద్దగా లెక్క చేయలేదు. వాస్తవానికి ఇలాంటి ఘటన జరిగినప్పుడు బోర్డు ఛైర్మన్ స్వయంగా ఉద్యోగులతో చర్చించి… సమస్య పరిష్కారానికి కృషి చేస్తారు. కానీ నరేష్ కుమార్ విషయంలో మాత్రం అలా జరగలేదు. అటు ఈవో, జేఈవోలు కూడా మాకెందుకు అన్నట్లుగానే వ్యవహరించారు తప్ప… ఉద్యోగులతో చర్చించినట్లు ఎలాంటి సమాచారం బయటకి రాలేదు.

Also Read : ఆ ఇద్దరూ వచ్చేస్తున్నారు.. పాక్ తో మ్యాచ్ పై భారత్ ఫోకస్

ఇక ఉద్యోగిపై బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ దురుసు ప్రవర్తన, ఉద్యోగుల ఆందోళనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో కూటమి ప్రభుత్వం చర్యలేవి అంటూ వైసీపీ నేతలతో పాటు కొందరు హిందూ సంఘాల ప్రతినిధులు కూడా విమర్శలు గుప్పించారు. దేవదేవుని సన్నిధిలోనే ఇలా బూతులు మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. అయినా సరే నరేష్ కుమార్ మాత్రం ఏ మాత్రం స్పందించలేదు. ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తున్నట్లు గుర్తించిన సీఎం చంద్రబాబు.. ఈ విషయంపై సిరీయస్ అయ్యారు. ఈ విషయం పై బోర్డు ముఖ్యులతో కూడా మాట్లాడి నరేష్ కుమార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. దీంతో వెనక్కి తగ్గి ఉద్యోగులకు నరేష్ కుమార్ స్వయంగా క్షమాపణ చెప్పారు. దీంతో ఈ సమస్య పరిష్కారం అయ్యింది.

Also Read : అందరూ స్టార్లే.. అఖండ2 పై బోయపాటి బిగ్ స్కెచ్

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… ఉద్యోగులకు ఓ క్షమాపణ చెబితే పరిష్కారం అయ్యే సమస్య కూడా సీఎం చంద్రబాబు వరకు చేరుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిన్న సమస్యలను పరిష్కరించేందుకు కూడా ఆయా శాఖల మంత్రులు, ఛైర్మన్‌లకు సమయం లేదా… లేక చేత కాదా అనే మాటలు వినిపిస్తున్నాయి. బీజేపీ అగ్రనేతలు కూడా ఈ విషయంపై చంద్రబాబు దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్