తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ రాష్ట్ర సమితి ఓడిపోయింది. ఇది బీఆర్ఎస్‌కు తొలి ఓటమి కూడా. ఇక ఆ తర్వాత నుంచి కేసీఆర్‌కు కాలం కలిసి వచ్చినట్లు లేదు. అసెంబ్లీ సమావేశాలకు రావాలంటే ముఖం చెల్లడం లేదా అంటూ కాంగ్రెస్ నేతలు సైతం మాజీ సీఎం కేసీఆర్ పై సెటైర్లు వేస్తున్నారు. ఇక ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో చివరి వరకు అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి. పరువు కోసం పోటీ చేసినప్పటికీ… కనీసం ఒక్కచోట కూడా బీఆర్ఎస్ గెలవకపోవడంతో… సున్నా పార్టీ అంటూ విమర్శలు చేస్తున్నారు అధికార పార్టీ నేతలు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది.
Also Read : అందరూ స్టార్లే.. అఖండ2 పై బోయపాటి బిగ్ స్కెచ్
నిన్నటి వరకు టార్గెట్ రేవంత్ రెడ్డి అన్నట్లుగా వ్యవహరించారు బీఆర్ఎస్ నేతలు. గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ నేతలపైన వ్యక్తిగత విమర్శలు చేశారు. అలాగే తెలంగాణ అభివృద్ధి తమతోనే సాధ్యమని మరోసారి నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే ఇదేమీ వర్కవుట్ కాలేదు. ఇక రేవంత్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకించే పరిస్థితి కనిపించడం లేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సిలెండర్‌కు నగదు బదిలీ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు వంటివి వ్యతిరేకిస్తే.. తమకే ప్రమాదమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావించినట్లు తెలుస్తోంది. దీంతో మరోసారి తమకు అధికారం వచ్చేందుకు కారణమైన పాత పాటే బెటర్ అని భావించినట్లు తెలుస్తోంది.
Also Read : బాహుబలిలా టీడీపీ సోషల్ మీడియా
వాస్తవానికి వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చేందుకు కేసీఆర్ చేసిన ఒకటే పని సెంటిమెంట్. తొలిసారి తెలంగాణ సెంటిమెంట్ అయితే… రెండోసారి మాత్రం చంద్రబాబును ఏపీకి చెందిన నేతగా… తెలంగాణ వ్యతిరేకి అనేలా ప్రచారం చేయడంలో సక్సెస్ అయ్యారు. దీంతో మరోసారి కూడా అదే బెటర్ అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇటీవల జరిగిన పార్టీ నేతల విస్తృత స్థాయి సమావేశంలో మరోసారి చంద్రబాబు పేరు ప్రస్తావించారు. ఎన్డీయే కూటమిని అడ్డుపెట్టుకుని తెలంగాణలో పార్టీని విస్తరించేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పాటును చంద్రబాబు అడ్డుకునేందుకు ప్రయత్నించారని… మరోసారి కూడా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు కేసీఆర్.
Also Read : కేసీఆర్ స్పీడ్.. బిజెపిలో మొదలైన టెన్షన్
కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు బలం చేకూర్చేందుకు మాజీ మంత్రి హరీష్ రావు రంగంలోకి దిగారు. నాగార్జున సాగర్ నుంచి నీటిని అక్రమంగా ఏపీకి తరలించుకు పోయేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని వ్యాఖ్యానించారు. చంద్రబాబును ప్రశ్నించే దమ్ము రేవంత్ రెడ్డికి లేదంటూ వ్యాఖ్యలు చేశారు. ఒకరకంగా చూస్తే… అటు రేవంత్ రెడ్డిని కూడా రెచ్చగొట్టేలా హరీష్ వ్యాఖ్యలున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే హరీష్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతల తరఫున నుంచి ఎలాంటి కౌంటర్ రాలేదు. పైగా హరీష్ వ్యాఖ్యలను హస్తం పార్టీ నేతలు లైట్ గా తీసుకున్నారు. ఎన్నికల్లో మరోసారి గెలిచేందుకు సెంటిమెంట్‌తో పాటు చంద్రబాబును బూచిగా చూపుతున్నారని విమర్శలు చేశారు. కేసీఆర్ ప్లాన్ వర్కవుట్ అయ్యే అవకాశం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.