Friday, September 12, 2025 11:12 PM
Friday, September 12, 2025 11:12 PM
roots

ఆ రోజు కూడా రాకపోతే ఇంకెందుకు…!

సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28న 2025-26 ఆర్థిక ఏడాదికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెట్టనున్నారు. సభ ప్రారంభం రోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఇప్పటికే సభ నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సభలో ఎలా వ్యవహరించాలనే విషయంపై తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నేతలు ఆయా పార్టీల సభ్యులకు చెప్పేశారు కూడా. ఇక బడ్జెట్ సమావేశాల్లోనే ఎమ్మెల్యేలకు అవగాహన సదస్సులు కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఈ సెషన్‌కు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరు అవుతారా లేక హాజరవుతారా అనే విషయం ప్రస్తుతం మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.

Also Read : బాహుబలిలా టీడీపీ సోషల్ మీడియా

వాస్తవంగా తొలి రోజు గవర్నర్ ప్రసంగం రోజున ఏ పార్టీకి చెందిన సభ్యుల ప్రసంగాలు ఉండవు. కేవలం ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రభుత్వ లక్ష్యాలను మాత్రమే గవర్నర్ సభలో వివరిస్తారు. ఆ తర్వాత సభ వాయిదా పడుతుంది. ఇక అదే రోజున బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. ఆ మీటింగ్‌లో సభల ఎన్ని రోజులు నిర్వహించాలనే విషయంపై అన్ని పార్టీల నేతలు చర్చించి నిర్ణయం తీసుకుంటారు. అలాగే బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున కూడా కేవలం ఆర్థిక మంత్రి ప్రసంగం మాత్రమే ఉంటుంది. బడ్జెట్ లెక్కలు, ప్రభుత్వ ప్రాధాన్యతలు, కేటాయింపులను మంత్రి వివరిస్తారు. ఆ తర్వాత ఏ శాఖకు ఎంత కేటాయించారనే విషయాన్ని మంత్రి లెక్కలతో సహా వివరిస్తారు. ఆ తర్వాత నుంచి బడ్జెట్ పై సభలో చర్చ నడుస్తుంది. ఇక బడ్జెట్ ప్రవేశానికి ముందే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుంది కూడా. దీనిపై అన్ని పార్టీల నేతలు వారి వారి అభిప్రాయాలు వెల్లడిస్తారు. ఇది సభలో ఇప్పటి వరకు జరుగుతూ వస్తున్న ఆనవాయితీ.

Also Read : పవన్ కు వెయిట్ ఇవ్వడం వెనుక రీజన్ అదేనా…?

అయితే పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఆ తర్వాత నుంచి సభకు హాజరుకాలేదు. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని… అదే సమయంలో ముఖ్యమంత్రికి కేటాయించినంత సమయం తనకు కూడా కేటాయించాలని వితండ వాదన చేస్తున్నారు. అలా ఇవ్వడం సాధ్యం కాదని చెప్పడంతో… సభలో తమ గొంతు నొక్కుతున్నారనే విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తూ సభకు గైర్హాజరయ్యారు. అయితే గవర్నర్ ప్రసంగం రోజున, బడ్జెట్ ప్రసంగం రోజున సభకు వస్తే ఎలాంటి ఇబ్బందులు లేవు కదా అనే మాట ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. అదే సమయంలో పదేళ్లు సీఎంగా చేసిన కేసీఆర్… ఓడిన తర్వాత కూడా బడ్జెట్ సమావేశాలకు వచ్చి సభ గౌరవాన్ని కాపాడిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. అసలు సభకు రావడానికి జగన్‌కు భయం ఎందుకు అని నిలదీస్తున్నారు. కనీసం గవర్నర్ ప్రసంగంపై అభ్యంతరాలు చెప్పడానికి అయినా రావొచ్చు కదా అనేది వైసీపీ నేతల మాట. కానీ జగన్ మాత్రం వచ్చే సూచనలు ఏ మాత్రం కనిపించడం లేదు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్