సౌత్ ఇండియాలో బిజెపి బలపడటం అనేది ఆ పార్టీ పెద్దలకు అత్యంత అవసరం. రాజకీయంగా ఇప్పుడు ఉత్తరాదిన బిజెపికి సానుకూల వాతావరణం కనపడుతున్నా అది.. కేవలం సృష్టి మాత్రమే గాని వాస్తవం కాదు. అందుకే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో తమ బలం పెంచుకోవాలని బిజెపి పెద్దలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ వస్తున్నారు. కర్ణాటకలో అధికారం కోల్పోయిన తర్వాత బిజెపి క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ బిజెపి రాజకీయంగా అక్కడ పుంజుకోవాలి అంటే నాయకత్వ సమస్యను పరిష్కరించాలి.
Also Read : కొత్త డ్రామా మొదలుపెట్టిన వైసీపీ..!
అక్కడ బిజెపి వృద్ద నాయకత్వమే గాని సరైన నాయకులు కనపడటం లేదు. అందుకే డీకే శివకుమార్ వంటి వాళ్లకు గాలం వేసే ప్రయత్నం చేస్తోంది. ఇదే టైం లో కేరళ, తమిళనాడు, తెలంగాణా రాష్ట్రాల్లో ఏం చేయాలో అర్ధం కాక ఇప్పుడు సతమతమవుతున్నారు. ఇలాంటి టైం లో పవన్ కళ్యాణ్ ను ప్రయోగిస్తే మంచిది అనే అభిప్రాయానికి బిజెపి పెద్దలు వచ్చినట్టే కనపడుతోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో తమకు పూర్తిగా సహకరించిన పవన్ కళ్యాణ్ ను ఇప్పుడు సౌత్ లో రంగంలోకి దించే యోచనలో ఉన్నట్టే అర్ధమవుతోంది.
Also Read : జగన్ కు మరో మాజీ ఝలక్ ఇస్తారా..?
సాధారణంగా మోడీ.. తమ పార్టీ నేతలకు కూడా విలువ ఇవ్వరు అనే అభిప్రాయం ఉంది. కాని పవన్ కళ్యాణ్ కు మాత్రం వెయిట్ ఇస్తున్నారు. పవన్ తో చాలా సన్నిహితంగా ఉంటున్నారు. తాజాగా ఢిల్లీ సిఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూడా ఇదే జరిగింది. ఇటీవల పవన్ కళ్యాణ్.. కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు వెళ్ళారు. ప్రముఖ దేవాలయాలను సందర్శించి వచ్చారు. వ్యక్తిగత పర్యటన అని చెప్పినా.. బిజెపికి బలం లేని రెండు రాష్ట్రాల్లో సనాతన ధర్మం పేరుతో పవన్ పర్యటన సాగింది. వచ్చే ఏడాది ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు పవన్ ను ఇక్కడ రంగంలోకి దించి యువతను తమ వైపుకు తిప్పుకునేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు అర్ధమవుతోంది. ఇది దృష్టిలో ఉంచుకునే పవన్ కళ్యాణ్ కు బిజెపి ఆ స్థాయిలో వాల్యూ ఇస్తోంది అంటున్నాయి రాజకీయ వర్గాలు.