Friday, September 12, 2025 08:59 PM
Friday, September 12, 2025 08:59 PM
roots

కొత్త డ్రామా మొదలుపెట్టిన వైసీపీ..!

అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు.. పట్టుకోవడం ఎలాగో వైసీపీ నేతలు బాగా తెలుసు. అవకాశం వస్తే ఆహా ఓహో అనేస్తారు… అదే పరిస్థితి తారుమారు అయితే మాత్రం… ఇలా చేయడం తప్పు అంటూ ఎదుటి వారికి నీతులు చెప్తారు. తాజాగా జరుగుతున్న పరిణామాలు వైసీపీ నేతల రెండు నాల్కల ధోరణికి అద్దం పడుతున్నాయి. రెండు రోజుల క్రితం విజయవాడలోని జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. ఆ సమయంలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. జగన్ తో సెల్ఫీ కోసం ఓ చిన్నారి రిక్వెస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇక వైసీపీ సొంత మీడియా సాక్షిలో ఆ పాపను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ కూడా చేశారు.

Also Read : జగన్ కు మరో మాజీ ఝలక్ ఇస్తారా..?

అమ్మ ఒడి రాలేదని.. ఇంట్లో ఇబ్బందిగా ఉందంటూ చిన్నారితో మీడియా ముందు విమర్శలు చేయించారు కూడా. ఇక ఆ తర్వాత నుంచి.. జగన్ క్రేజ్ ఎలా ఉందో చూడండి అంటూ ముందు వైసీపీ నేతలే సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టారు కూడా. అపోజిషన్ లో ఉన్న మనమే అలా చేస్తే… అధికారంలో ఉన్నోడు ఇంకెంత చేస్తాడు బాచిరెడ్డి.. అనే అతడు సినిమాలో డైలాగ్ మాదిరిగా కూటమి నేతలు రెచ్చిపోయారు. అసలు ఆ చిన్నారి ఎవరు, ఏం చదువుతోంది.. బ్యాక్ గ్రౌండ్ వంటి వివరాలను క్షణాల్లో బయటపెట్టారు. ఓ కార్పొరేట్ స్కూల్ లో చదువుతోందని.. అమ్మ ఒడి డబ్బులు మాత్రమే కుటుంబానికి జీవనాధారం కాదనే విషయాన్ని బాగా వైరల్ చేశారు. ఇక కొందరైతే… పెయిడ్ ఆర్టిస్టులతో మళ్లీ మొదలైందా అంటూ జగన్ ను తెగ ట్రోల్ చేశారు కూడా.

Also Read : ధూళిపాళ్ళ మాటకు పవన్ విలువిచ్చారా…?

ఇక కొంతమంది అయితే పుష్ప 2 సినిమా ప్రీ రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనను గుర్తుచేస్తున్నారు. అంత మంది జనం మధ్యలోకి చిన్న పిల్లలతో రావటం ప్రమాదం అని తెలియదా అని ప్రశ్నించారు కూడా. దీంతో పరిస్థితి బూమ్ రాంగ్ అయ్యిందని భావించిన వైసీపీ నేతలు… ఇప్పుడు కొత్త పాట పాడుతున్నారు. చిన్న పిల్లల గురించి సోషల్ మీడియాలో ఇలా పోస్టులు పెట్టడం సంస్కారం కాదంటున్నారు. అదే సమయంలో చిన్నారి తండ్రి చేత ఓ వీడియో బైట్ కూడా రిలీజ్ చేశారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే.. వైసీపీ నేతలు ఎప్పుడు ఇలా తప్పుడు ట్రోల్స్ చేయలేదన్నారు కూడా. దీంతో గతంలో వైసీపీ సోషల్ మీడియా సైకోలు చేసిన మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలను అమర్నాథ్ కు పంపుతున్నారు టీడీపీ నేతలు. దీంతో అన్ని వైపుల నుంచి కౌంటర్ ఎటాక్ మొదలవ్వటంతో… వైసీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్