Friday, September 12, 2025 09:22 PM
Friday, September 12, 2025 09:22 PM
roots

బాహుబలిలా టీడీపీ సోషల్ మీడియా

2014 నుంచి 2019 వరకు చూసుకుంటే.. టిడిపి సోషల్ మీడియా చాలా బలహీనంగా కనపడేది. ముఖ్యంగా వైసిపి చేసే ఆరోపణల విషయంలో టిడిపి సోషల్ మీడియా పెద్దగా రియాక్ట్ అయ్యేది కాదు. ఇక జగన్ మాట్లాడే మాటలను వైసిపి ప్రమోట్ చేసుకునే విషయంలో సక్సెస్ అయితే.. చంద్రబాబునాయుడు మాట్లాడే మాటలను లోకేష్ మాట్లాడే మాటలను జనాల్లోకి తీసుకెళ్లే విషయంలో టిడిపి ఎప్పుడూ ఫెయిల్ అవుతూనే ఉండేది. అయితే 2019లో అధికారం కోల్పోయిన తర్వాత.. టిడిపి సోషల్ మీడియాలో పౌరుషం పెరిగింది.

Also Read : మిర్చి బస్తాల చోరీ.. మరీ ఇంత నీచమా..!

అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని టిడిపి సోషల్ మీడియా గట్టిగానే టార్గెట్ చేసింది. జగన్ ఏ కార్యక్రమాన్ని చేసిన దానిపై ప్రజల్లో వ్యతిరేకతను పెంచడంలో టిడిపి సోషల్ మీడియా సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇక 2024 లో అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపి సోషల్ మీడియా మరింత బలం పుంజుకుంది. ముఖ్యంగా వైఎస్ జగన్ చేస్తున్న ఆరోపణలను, ఆయన చేష్టలను ప్రజల్లోకి తీసుకెళ్లి వాటిని ఎండగట్టే విషయంలో టిడిపి సోషల్ మీడియా సక్సెస్ అవుతుంది. టిడిపి అనుకూల మీడియా కూడా జగన్ ను ఎండగట్టే విషయంలో దాదాపుగా సఫలమవుతుందనే చెప్పాలి.

Also Read : జగన్ కు మరో మాజీ ఝలక్ ఇస్తారా..?

జగన్.. గుంటూరు మిర్చి యార్డ్ లో చేసిన హడావుడి.. ఎందుకు అనేది జనాలకు వివరించడంలో టిడిపి సోషల్ మీడియా సక్సెస్ అయింది. కేవలం భద్రత కోసం జగన్ డ్రామాలాడుతున్నాడని.. అందుకే మిర్చి యార్డ్ వద్ద హడావుడి చేసి, భద్రత లేదు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడని, ఇక జగన్ మిర్చి యార్డ్ పర్యటన అయిన వెంటనే ఎంపీ మిధున్ రెడ్డి లేఖ రాయడం వెనక ఉద్దేశం అదే అంటూ టిడిపి సోషల్ మీడియా ఆసక్తికర విషయాలు బయటపెట్టింది.

Also Read : ఐపాక్ వద్దన్నా ప్లీజ్.. వైసీపీ క్యాడర్ రిక్వెస్ట్

ఇక విజయవాడ జగన్.. పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న కొన్ని కామెడీ సన్నివేశాలను కూడా ప్రజల్లో సాక్షాలతో సహా బయటపెట్టి దుమ్మురేపింది టిడిపి క్యాడర్. అటు గత ప్రభుత్వ మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతి అక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకురావడంలో టిడిపి క్యాడర్ సక్సెస్ అవుతుందని చెప్పాలి. ఇక ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే కొన్ని వివాదాస్పద నిర్ణయాలను వెనక్కి తీసుకునే విషయంలో కూడా టిడిపి సోషల్ మీడియా సక్సెస్ అయింది. కీలక అధికారుల బదిలీలను, పార్టీలోకి రావాలనుకునే నాయకులను అడ్డుకునే విషయంలో క్యాడర్ సక్సెస్ అవుతోంది. తమ మనోభావాలు దెబ్బతింటే ఎక్కడవరకైనా వెళ్తామని టిడిపి క్యాడర్ ప్రూవ్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్