టీం ఇండియా మిడిల్ ఆర్డర్ లో అత్యంత కీలక ఆటగాళ్లలో అజీంక్యా రహానే ముందు వరుసలో ఉంటాడు. ముఖ్యంగా విదేశీ మైదానాల్లో ఇతని ప్రదర్శన గొప్పగానే ఉంటుంది. 2023లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అతని ఆటతీరును ఇప్పటికీ అభిమానులు మర్చిపోలేదు. జట్టులోని ఆటగాళ్లు అందరూ విఫలమైనా సరే రహానే మాత్రం ఒంటరిగా పోరాటం చేశాడు. అయితే తనకు తుదిజట్టులో అవకాశం కల్పించకపోవడాన్ని… రహానే జీర్ణించుకోలేకపోతున్నాడు. దీనిపై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఈ సీనియర్ ఆటగాడు.
Also Read : బాలీవుడ్ గోల్డెన్ లెగ్ రష్మిక
తాను మంచి ఫామ్ లో ఉన్నప్పుడే.. భారత జట్టులో స్థానం కోల్పోయానని.. ఆ తర్వాత స్థిరంగా రాణించినా సెలెక్టర్ లు తనను పక్కన పెట్టారని… దీనితో తాను పునరాగమనం చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక తనకు జట్టులో చోటు ఎందుకు దక్కలేదు అని వివరణ అడుగుదాం అనుకుంటే సెలక్టర్లు ఎవరు అందుబాటులో లేరని తెలిపాడు. కొన్నాళ్ల క్రితం తనను జట్టులో నుంచి తప్పించినప్పుడు… మళ్ళీ పరుగులు సాధించే టెస్ట్ జట్టులోకి వచ్చినట్టు తెలిపాడు.
Also Read : ఆ ఇద్దరి కోసం అగార్కర్, గంభీర్ మధ్య వాగ్వాదం
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో రాణించానని, ఆ తర్వాత వెస్టిండీస్ పర్యటనలో వైస్ కెప్టెన్ గా కూడా ఉన్నానని పేర్కొన్నాడు. కానీ తర్వాతి సీరీస్ నుంచి తప్పించారని.. ఆపై దేశవాళితో పాటుగా ఐపీల్ లోను సత్తా చాటానని గుర్తు చేసుకున్నాడు. దీనితో కఠినమైన దక్షిణాఫ్రికా తో సీరీస్ కు కచ్చితంగా చోటు దక్కుతుందని అనుకున్నానని, అయినా నిరాశ ఎదురయింది అన్నాడు. ఒక సీనియర్ ప్లేయర్ జట్టులోకి పునరాగమనం చేసిన తర్వాత అతడికి కనీసం రెండు మూడు సీరీస్లు ఆడే అవకాశం ఇవ్వాలని, తనని ఎందుకు జట్టులో నుంచి తీసేసారు అని అడిగే వ్యక్తిని కాదని.. కానీ చాలామంది సెలెక్టర్లతో మాట్లాడు అని సలహా ఇచ్చారని… కానీ అవతలి వ్యక్తులు స్పందిస్తేనే మాట్లాడగలమని సంచలన వ్యాఖ్యలు చేసాడు.