దేవర సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో తాను ఏంటి అనేది ప్రూవ్ చేసుకున్న ఎన్టీఆర్.. ఇప్పుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని.. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేసుకోవడానికి రెడీ అవుతోంది. కలకత్తా.. బంగ్లాదేశ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీ లో ఓల్డ్ కలకత్తా సెట్ కూడా వేశారు. మరో మూడు నాలుగు రోజుల్లో ఈ సినిమా షూటింగ్ అక్కడ స్టార్ట్ చేయడానికి ప్రశాంత్ నీల్ వర్కౌట్ చేస్తున్నాడు.
Also Read : నాయకుల వంతు.. మరో మాజీ మంత్రిపై మూడు కేసులు
అయితే ఈ సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొనడం మరింత ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉంది అనే ప్రచారం ఎన్టీఆర్ అభిమానులను కలవరపెడుతోంది. బాలీవుడ్ సినిమా వార్ సీక్వెల్ కోసం ఎన్టీఆర్ దాదాపు రెండు మూడు నెలల నుంచి కష్టపడుతున్నాడు. దాదాపు ఆ సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ పోర్షన్ కంప్లీట్ అయిపోయింది. ఇక మిగిలిన పోర్షన్ హృతిక్ రోషన్ కు ఇతర నటులకు మధ్య జరగనుంది. అయితే ఎన్టీఆర్ పోర్షన్ కంప్లీట్ అవ్వలేదు అనే ప్రచారం కూడా ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో మొదలైంది.
Also Read : వైసీపీలో 14 రోజుల భయం.. వంశీ ఇప్పట్లో కష్టమే..?
ఎన్టీఆర్ మరో 20 రోజులు షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది అనే సంకేతాలు వస్తున్నాయి. దీనితో ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ లేకుండానే జరిగే అవకాశం ఉంది అనే ప్రచారం ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతోంది. వాస్తవానికి జనవరి మూడో వారం నుంచి ఎన్టీఆర్ సినిమా షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలతో అది వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఫిబ్రవరి రెండో వారం నుంచి మొదలయ్యే ఛాన్స్ ఉంది అని తర్వాత ఓ వార్త బయటకు వచ్చింది. ఇప్పుడు అది కూడా ఆలస్యం అవుతుందని టాక్.
Also Read : సానుభూతి కోసం జగన్ నయా స్కెచ్
ఎన్టీఆర్ మార్చ్ మూడో వారం నుంచి షూటింగ్ లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని.. ఈ లోపు రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసే ఆలోచనలో డైరెక్టర్ ఉన్నాడని అంటున్నారు. ఇక ఈ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేసే అవకాశం ఉంది.




