ఆంధ్రప్రదేశ్ లో వైసిపి తిరిగి బలపడేందుకు గట్టిగానే ప్రయత్నాలు మొదలుపెట్టింది. రాజకీయంగా ప్రస్తుతం బలహీనంగా ఉన్న ఆ పార్టీ… వచ్చే ఎన్నికల్లో మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలని టార్గెట్ పెట్టుకొని పని చేస్తుంది. వైసీపీ అధినేత జగన్ ఈ మధ్యకాలంలో చేస్తున్న కామెంట్స్ కూడా కాస్త గట్టిగానే వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా కాంగ్రెస్ కు చెందిన ఓ నేత వైసిపిలో చేరిపోయారు. దీని కోసం ఆయన గత కొన్ని రోజులుగా చర్చలు జరిపి.. అవి ఫలప్రదం కావడంతో జగన్ సమక్షంలో పార్టీలో చేరిపోయారు. అనంతపురం జిల్లాకు చెందిన శైలజానాథ్ కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు అనుభవించారు.
Also Read: ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యావు జగన్..?
మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. ఇక ఇప్పుడు ఆయన వైసీపీలో చేరాలి అనుకోవడం కాస్త సంచలనం అవుతోంది. ఇక మరి కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా జగన్ వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తన ఓటు బ్యాంకును లాక్కునే అవకాశం ఉండటంతో జగన్ అలర్ట్ అవుతున్నారు. కాంగ్రెస్ లో చోటామోటా నాయకులు అందర్నీ పార్టీలోకి తీసుకువచ్చేందుకు పావులు కదుపుతున్నారు. అలాగే వైయస్ షర్మిలకు సహకరించే కాంగ్రెస్ నేతలను కూడా పార్టీలోకి తీసుకురావాలని జగన్ టార్గెట్ గా పెట్టుకున్నారు. షర్మిల తన భవిష్యత్ రాజకీయ వ్యుహలకు అడ్డు కాకుండా ఉండాలి అంటే.. ఏపిలో కాంగ్రెస్ తిరిగి పుంజుకోకూడదు. దానికి ఏమి చేయాలో అవన్నీ చేయడానికి జగన్ సిద్దం పడ్డారు అని సమాచారం.
Also Read: అగ్ని ప్రమాదంపై డౌట్స్.. కాలింది అవేనా…?
రాయలసీమలో ప్రధానంగా కొంతమంది షర్మిలకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారని, వాళ్ళందరి తన వైపుకు తిప్పుకుంటే తనకు భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే శైలజానాథ్ కు అందుకు కీలక పదవి ఆఫర్ చేసి తీసుకొచ్చారని తెలుస్తోంది. ఆయనను త్వరలోనే అనంతపురం జిల్లాకు పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేసే అవకాశం కూడా ఉండవచ్చని వార్తలు వస్తున్నాయి. సింగనమల నియోజకవర్గానికి చెందిన శైలజానాథ్ కు అప్పుడే సీటు కూడా జగన్ ఖరారు చేసినట్లు సమాచారం. అలాగే మాజీ కేంద్ర మంత్రులు కిల్లి కృపారాణి, పళ్ళం రాజులకు కూడా జగన్ గాలం వేసినట్టు తెలుస్తోంది. ఇక తిరుపతికి చెందిన కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ తో కూడా వైసిపి పెద్దలు సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.