Friday, September 12, 2025 05:14 PM
Friday, September 12, 2025 05:14 PM
roots

రామ్ కోసం బాలయ్య.. ఫేట్ మారుతుందా..?

ఎనర్జీటిక్ హీరో రామ్ పోతినేని… సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయినా సరే సినిమాలు చేస్తూనే ఉంటాడు. గత ఐదేళ్లలో అతని సినిమాలు ఒకటి మాత్రమే హిట్ అయ్యాయి. ఇక ఏ డైరెక్టర్ తో సినిమా చేసినా సరే.. ఈ హీరోకు కలిసి రావటం లేదు. దీనితో ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. కథల సెలక్షన్ విషయంలో జాగ్రత్తగా ఉండని రామ్… ఇప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త పడుతున్నాడు. ప్రస్తుతం పీ. మహేష్ బాబు అనే డైరెక్టర్ తో కొత్త సినిమా చేస్తున్న రామ్ ఈ సినిమా కోసం కాస్త తన లుక్ కూడా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాడు.

ఈ సినిమా ఎలాగైనా సరే హిట్ అవ్వాలని… అతని అభిమానులు కూడా ఆశలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా విషయంలో డైరెక్టర్ అలాగే ప్రొడ్యూసర్ కూడా కాస్త జాగ్రత్తగానే ఉన్నారు. ఈ సినిమాలో ఒక స్టార్ హీరోకు మంచి పాత్ర ఇవ్వాలని, గెస్ట్ రోల్ లో చేయించాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ హీరో ఎవరో కాదు నందమూరి బాలకృష్ణ. ఆయనతో ఒక గెస్ట్ రోల్ చేయించారని… ఆయన పాత్ర కనీసం సినిమాలో 15 నుంచి 20 నిమిషాలు ఉండేలా ప్లాన్ చేసుకోవాలని డైరెక్టర్ డిసైడ్ అయ్యాడని టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇందుకోసం బోయపాట సహాయం తీసుకుంటున్నారు అని వార్తలు వస్తున్నాయి.

ఇక ఇప్పటికే బాలకృష్ణకు కథ కూడా చెప్పారని, ఆయన కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. బాలకృష్ణకు రామ్ కు మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. దీంతో ఆయన ఓకే చేస్తారని ఎదురు చూస్తున్నారు సినిమా మేకర్స్. సాధారణంగా రామ్ సినిమాలన్నీ చాలా స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటాయి. కానీ ఈ సినిమా మాత్రం కాస్త స్లోగా ముందుకు వెళ్తోంది. ఈ ఏడాది దసరా కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక బడ్జెట్ విషయంలో కూడా కాస్త ఎక్కువగానే పెడుతున్నట్లు సమాచారం. కథ బాగుండడంతో నిర్మాతలు కూడా కాంప్రమైజ్ అవ్వకుండా పెట్టుబడి పెడుతున్నారు అని సమాచారం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్