Friday, September 12, 2025 07:04 PM
Friday, September 12, 2025 07:04 PM
roots

సీఎం చంద్రబాబే.. చీఫ్ మాత్రం పెద్దిరెడ్డి.. చిత్తూరులో వింత…!

పేరుకి ముఖ్యమంత్రి సొంత జిల్లా అయినా… జిల్లాలో ఆయన పట్టు మాత్రం చాలా తక్కువ. సాధారణంగా ముఖ్యమంత్రుల సొంత జిల్లాలో వారికి పట్టు ఎక్కువగా ఉంటుంది. అది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయినా, అప్పట్లో ఎన్టీఆర్ అయినా, ఆ తర్వాత కేసీఆర్ అయినా, ఎవరైనా సరే సొంత జిల్లాలో పట్టు పెంచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం సొంత జిల్లా పై ఎక్కువగా ఫోకస్ పెట్టేవారు కాదు. గతంలో ఆయనకు జిల్లాలో ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా, ఇప్పుడు మాత్రం సొంత జిల్లాలో తెలుగుదేశం పార్టీలో కోవర్టుల భయం ఆ పార్టీ కార్యకర్తలను బాగా ఇబ్బంది పెడుతుంది.

Also Read : ప్రభాస్ పై మలయాళం స్టార్ హీరో సెన్సేషనల్ కామెంట్స్

పార్టీలో చాలామంది నేతలు జిల్లా నుంచి ప్రాతినిధ్య వహిస్తున్నారు. అసలు ఎవరిని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో కూడా కార్యకర్తలకు అర్థం కాని పరిస్థితి నెలకొంది. చిత్తూరు జిల్లాలో పేరుకు తెలుగుదేశం పార్టీ అయినా… అధికారం చెలాయించేది మాత్రం వైసిపి అనే విమర్శలు వినపడుతున్నాయి. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుసన్నల్లోనే చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు నడుస్తున్నారని, వారిలో ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు అని ఆరోపణలు వినపడుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలంగా కనపడుతున్నా అది కేవలం మేకపోతు గాంభీర్యమే అనేది చాలామంది అభిప్రాయం.

Also Read : ఎన్సియేలో బూమ్రా.. ఛాంపియన్స్ ట్రోఫీ కష్టమేనా..??

పార్టీ అధిష్టానం ఆదేశాల కంటే పెద్దిరెడ్డి మాటకే జిల్లాలో ఎక్కువగా విలువ ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలు నిజాయితీగా పనిచేస్తున్నా… వారికి సహకారం అందించే విషయంలో మరి కొంతమంది నేతలు ముందుకు రావటం లేదు. ఇప్పటికే కొంతమంది నేతల విషయంలో గతంలో చంద్రబాబునాయుడు చర్యలు తీసుకున్నారు. అయినా సరే మిగిలిన నేతల్లో మార్పు రావడం లేదు అనే ఆరోపణలు వినపడుతున్నాయి.

Also Read : చంద్రబాబుకు షర్మిల సలహా.. ఆ ఒక్కటి జాగ్రత్త…!

వైసిపి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అలాగే తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వంటి వారితో కూడా టిడిపి నేతలు మంచి సంబంధాలే కొనసాగిస్తున్నారు. దీనితో పార్టీ కార్యకర్తలు అసహనంగా ఉన్నారు. దీనిపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టాలని, కోవర్టులను జిల్లా నుంచి తరిమికొట్టాలని కోరుతున్నారు. మదనపల్లి ఫైల్స్ సమయంలో గానీ ఇటీవల పెద్దిరెడ్డి పై వచ్చిన ఆరోపణల సమయంలో గానీ చాలా మంది ఎమ్మెల్యేలు మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదు. దీనిపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్