Friday, September 12, 2025 08:57 PM
Friday, September 12, 2025 08:57 PM
roots

ఢిల్లీకి లోకేష్.. మోడీని కలుస్తారా లేదా…?

ఏపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. కేంద్ర ఐటి అండ్ ఎలక్ట్రానిక్స్, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో సమావేశం అయ్యేందుకు లోకేష్ ఢిల్లీ వెళుతున్నట్లు ఏపీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి లోకేష్ ఢిల్లీ చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు కేంద్రమంత్రి తో ఆయన భేటీ కానున్నారు. అనంతరం బుధవారం రాత్రే రాష్ట్రానికి తిరిగి రానున్నారు. ఏపీ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు అధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో లోకేష్ పర్యటన ఆసక్తిని రేపుతోంది.

Also Read : హిందూపురంలో బాలయ్య సినిమా సీన్.. కౌన్సిలర్లతో కలిసి…!

విశాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఏర్పాటు, వంటి అంశాలపై కేంద్ర మంత్రితో లోకేష్ చర్చించే అవకాశం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై శిక్షణ అలాగే నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడు ఆర్టిఫిషియల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్… సెంటర్స్ ను ప్రారంభిస్తున్న నేపథ్యంలో వాటికి కేంద్రం నుంచి సహకారాన్ని కోరేందుకు లోకేష్ ఢిల్లీ వెళుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే లోకేష్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలుస్తారా లేదా అనేదానిపై ఆసక్తి నెలకొంది.

Also Read : ఆరని మంచు మంటలు.. కలెక్టర్ ఆఫీస్ లో రచ్చ..!

ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన సందర్భంగా లోకేష్ ను ఢిల్లీ వచ్చి కలవాలని కోరారు. దీనిపై లోకేష్ కూడా సానుకూలంగానే స్పందించారు. దీనితో ఈ పర్యటనలో ప్రధానితో ఆయన భేటీ అవుతారా లేదా అనే దానిపై క్లారిటీ రావటం లేదు. ఇక లోకేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో రాజకీయంగా ఏమైనా పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయా అనే దానిపై కూడా ఆసక్తి నెలకొంది. లోకేష్ ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి వైసీపీలో కంగారు మొదలవుతుంది. మరి ఈ సారి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్