Monday, April 6, 2026 07:57 PM
Monday, April 6, 2026 07:57 PM

ఇలా అయితే కష్టమే.. సీనియర్ల అసహనం..!

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎదురు చెప్పే ధైర్యం ఆ పార్టీలో ఏ ఒక్కరికీ లేదు. జగన్ చెప్పిన మాటే ఫైనల్. జగన్ ఇచ్చిన సూచనలు పాటించడం.. జగన్ టికెట్ కేటాయించిన చోట పోటీ చేయటం మాత్రమే వైసీపీ నేతలు చేయాలి. అంతే తప్ప ఎదురు తిరిగి ప్రశ్నిస్తే.. వారిపై చర్యలుంటాయి. ఈ విషయం పార్టీలో కొత్తగా వచ్చిన వారి నుంచి సీనియర్ల వరకు ప్రతి ఒక్కరికీ తెలుసు. చివరికి నిత్యం జగన్‌తోనే ఉండే వారైనా సరే.. జగన్ సొంత బంధువులు అయినా సరే.. ఆయన చెప్పినట్లు చేయాల్సిందే. అంతే తప్ప ఎదురు సమాధానం మాత్రం చెప్పకూడదు.

తాజాగా జగన్ రాజధాని అమరావతిపై మరోసారి తన అభిప్రాయం బయటపెట్టారు. తొలి నుంచి అమరావతికి వ్యతిరేకంగానే జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారు. అక్కడ డబ్బులు వృధా చేస్తున్నారని.. అందుకే మూడు రాజధానుల అంశాన్ని తెర పైకి తీసుకువస్తున్నట్లు గతంలో చాలాసార్లు ప్రకటించారు. అయితే న్యాయ పరమైన అడ్డంకులతో పాటు ప్రజల నుంచి కూడా తీవ్రస్థాయిలో వ్యతిరేకత రావడంతో.. అమరావతికి ఓకే చెప్పారు. కూటమి సర్కార్ అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా చేస్తున్నప్పటికీ.. జగన్ తీరు మాత్రం మారలేదు. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్‌ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినప్పటికీ.. జగన్ మాత్రం మావిగన్ పేరుతో వింత ప్రతిపాదన చేశారు. ఇదే ఇప్పుడు వైసీపీలో ముసలం తెచ్చిపెడుతోంది.

Also Read : నరసరావుపేటలో వైసీపీలో రచ్చరచ్చ.. అసలేం జరిగింది..?

జగన్ మావిగన్ ప్రకటనపై మెజారిటీ వైసీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే వైసీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలు తెగేసి చెప్పారు. గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ విషయం జగన్‌కే చెప్పాలంటూ సజ్జల తప్పుకున్నారు. తాజాగా జగన్ మావిగన్ ప్రకటన తమ రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వైసీపీలో కొందరు సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఓ నేత నివాసంలో పార్టీలోని సీనియర్లు రహస్యంగా సమావేశం అయినట్లు తెలుస్తోంది. పార్టీలోని కీలక నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్లు సమాచారం.

జగన్ మావిగన్ ప్రకటన వల్ల రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుపు అవకాశాలు మరింత కష్టంగా మారినట్లు నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. మరో 15 ఏళ్ల పాటు టీడీపీ, జనసేన కలిసే పోటీ చేస్తాయని ఓ వైపు పవన్ చెబుతున్న విషయాన్ని కూడా చర్చించారు. కూటమి కలిసే ఉంటే జగన్ గెలుపు కష్టమని మాజీ ఎంపీ ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే కేడర్‌లో ఆందోళన కలిగిస్తున్నాయని.. ఇలాంటి సమయంలో గత ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణమైన మూడు రాజధానుల అంశాన్నే పరోక్షంగా ప్రస్తావించిన జగన్.. అమరావతికి వ్యతిరేకంగా మావిగన్ ప్రతిపాదన చేయడాన్ని సీనియర్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇప్పటికే ప్రజల్లో కావాల్సినంత వ్యతిరేకత ఉందని.. ఇంకా వైసీపీలో కొనసాగితే రాజకీయంగా ప్రజలు సమాధి కడతారని ఉత్తరాంధ్రకు చెందిన ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ప్రజలు కూటమి పాలన కంటే.. జగన్ చేసిన వ్యాఖ్యాలపైనే ఎక్కువగా చర్చించుకుంటున్నారని.. జగన్‌ వెంటే ఉంటే.. ప్రజాగ్రహానికి గురి కావడం ఖాయమని గోదావరి జిల్లాలకు చెందిన మాజీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

Also Read : ఫౌజీ లీకులపై మేకర్స్ సీరియస్.. లీక్ చేస్తే అంతే..!

అయితే ఒక్కసారి అధినేతతో ఈ విషయం చర్చించి నిర్ణయం తీసుకోవాలన్న ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఓ నేత సూచనను సీనియర్లు కొందరు వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. గతంలో ఆనం రామనారాయణ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి వంటి నేతలు భేటీ అయిన వెంటనే.. వారిని టార్గెట్ చేసిన విషయం మర్చిపోయారా అని ఒక నేత వ్యాఖ్యానించినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై కొద్ది రోజులు ఆగాలని.. పరిస్థితిలో మార్పు వస్తుందేమో చూద్దామని రాయలసీమకు చెందిన జగన్‌కు అత్యంత సన్నిహిత మాజీ మంత్రి ఒకరు సూచించినట్లు తెలుస్తోంది. పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోతే.. అప్పుడు పార్టీ మార్పుపై కలిసే నిర్ణయం తీసుకుందామని సలహా ఇచ్చినట్లు సమాచారం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అధికారుల తీరును బహిరంగంగా.....

అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్ళిన ఏపీ...

నరసరావుపేటలో వైసీపీలో రచ్చరచ్చ.....

పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట వైసీపీలో.....

సట్టా బజార్ షాకింగ్...

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ...

ఏపీలో మరో రేపిస్ట్...

ఏపీలో అత్యాచారాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం...

యుద్ధం.. అప్రకటిత లాక్...

పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు ప్రపంచ దేశాలను...

లోకేష్ సింధనూరు యాత్రకు...

కర్ణాటకలోని సింధనూరులో ఏపీ ఐటీ, విద్యాశాఖ...

పోల్స్