Sunday, March 22, 2026 10:14 AM
Sunday, March 22, 2026 10:14 AM

అదాని నిన్ను ఎంతకు కొన్నాడు చంద్రబాబు..?

రేషన్ బియ్యం అక్రమాలపై విచారణకు స్పెషల్ సిట్ వేసిన కూటమి సర్కార్… అదాని ఒప్పందాలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. సోలార్ విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన రూ.1750 కోట్ల ముడుపులపై విచారణ ఎక్కడ అంటూ కూటమి సర్కార్ ను నిలదీశారు. బియ్యం మాఫియాపై పెట్టిన శ్రద్ధ.. అదానీ అక్రమ డీల్ పై ఎందుకు పెట్టలేక పోతున్నారు, అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదికలకు విలువ లేదా? మాజీ ముఖ్యమంత్రి స్వయంగా లంచాలు తీసుకున్నారని నివేదిక ఇస్తే, నిజాలు నిగ్గు తేల్చే బాధ్యత మీది కాదా?

Also Read: అక్రమ దందా.. ఎస్పీపైనే అనుమానాలు అన్నీ…?

మీరు కూడా అదానీకి అమ్ముడుపోయారా? తీగ లాగితే మాజీ ముఖ్యమంత్రితో పాటు, అదానీని సైతం అరెస్టు చేయాల్సి వస్తుందని భయపడుతున్నారా? నోరు విప్పకుండా, విచారణ చేయకుండా మౌనంగా ఉండేందుకు అదానీ మీకు ఎంత లంచాలు ఆఫర్ చేశారు? అంటూ చంద్రబాబు పై ప్రశ్నల వర్షం కురిపించారు షర్మిల. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా.. SECI తో చేసుకున్న ఒప్పందంలో భారీ అవినీతి అన్నారని, టెండర్లు లేకుండా అదానీకి కట్టబెట్టడం అంటే పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నారని ఆరోపణలు చేశారని, గుజరాత్ లో రూ 1.99 పైసలు దొరికే సోలార్ విద్యుత్ ను రాష్ట్ర ప్రభుత్వం రూ.2.49 పైసలకు ఎలా కొన్నారని ఉద్యమాలు చేశారని గుర్తు చేసారు షర్మిల.

Also Read: వివేకా కేసు తేలేనా… పోలీసులతో ఆడుకుంటున్న అవినాష్ అండ్ గ్యాంగ్

25 ఏళ్ల పాటు డీల్ అంటే రాష్ట్ర ప్రజల నెత్తిన లక్ష కోట్ల అదనపు భారం పడిందని చెప్పారన్నారు. ఇది ప్రజలను అదానీ కోసం నిలువునా దోచి పెట్టడం అని ఆరోపణలు చేసిన సర్కార్ ఈ డీల్ రద్దు చేయాలని ఇప్పటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ద్వారా హైకోర్టులో కేసు కూడా వేపించారనన్నారు. తాము అధికారంలో వచ్చాక నిజాలు నిగ్గు తేలుస్తాం అని.. గొప్ప గొప్ప మాటలు చెప్పారని ఎద్దేవా చేసారు. మరి ఇప్పుడేమైంది చంద్రబాబు గారు? అంటూ మండిపడ్డారు షర్మిల. అన్ని ఆధారాలు దగ్గర పెట్టుకొని, అధికారం దగ్గర పెట్టుకొని, మౌనంగా ఎందుకు ఉన్నారు సార్? అంటూ నిలదీశారు షర్మిల.

Also Read: అల్లు అర్జున్ కు వైసీపీ బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసింది

అంటే ఆనాడు జగన్ గారు అదానీకి అమ్ముడు పోయారు… ఇప్పుడు మీరు అమ్ముడు పోయారు అనే కదా అర్థం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. మిమ్మల్ని కూడా తక్కెడలో అదానీ నిలబెట్టారు అనే కదా అర్థం అంటూ షర్మిల ఎద్దేవా చేసారు. అదానీ మిమ్మల్ని కొనకపోతే, అదానీ ఒప్పందాలపై ప్రతిపక్షంలో చేసింది నిజమైన ఉద్యమం అయితే వెంటనే ఏసీబీని మీ పంజరం నుంచి విడుదల చేయండని, రూ.1750 కోట్ల ముడుపుల వ్యవహారంపై ఫాస్ట్రాక్ విచారణ జరిపించాలంటూ షర్మిల డిమాండ్ చేసారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్