Sunday, March 22, 2026 09:30 AM
Sunday, March 22, 2026 09:30 AM

ప్రధాని ఫోన్ కు రెడ్ స్టిక్కర్ వెనుక ఇంత స్టోరీ ఉందా..?

దేశ ప్రధానుల భద్రత విషయంలో.. ప్రభుత్వాలు ఎంతో సీరియస్ గా వ్యవహరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా బలమైన దేశాల ప్రధానుల భద్రత విషయంలో ఎక్కడా రాజీ ఉండదు అనే మాట వాస్తవం. ఇజ్రాయిల్, యూకే, భారత్, అమెరికా, ఇరాన్, కెనడా, చైనా, రష్యా, బ్రెజిల్, జర్మనీ వంటి దేశాల ప్రధానుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. తాజాగా ఇజ్రాయిల్ ప్రధాని ఫోన్ వ్యవహారం అంతర్జాతీయంగా సంచలనం అయింది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తన ఫోన్ వెనుక కెమెరాకు రెడ్ టేప్ వేసారు.

Also Read : తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్..!

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జెరూసలేంలోని ఇజ్రాయెల్ పార్లమెంట్, నెస్సెట్ భూగర్భ పార్కింగ్ ప్రాంతంలో క్లిక్ చేసిన ఈ ఫోటోలలో తన నల్లటి లగ్జరీ కారు పక్కన నిలబడి ఫోన్‌లో మాట్లాడుతున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇజ్రాయిల్ ప్రధాని తన ఫోన్ కు సెక్యూరిటీ ఫీచర్స్ యాడ్ చేస్తే.. సామాన్యులు కూడా తమ ఫోన్ లకు టేప్ వేసుకోవాలనే కామెంట్స్ వస్తున్నాయి. అసలు ఫోన్ కు టేప్ ఎందుకు వేయాల్సి వచ్చిందో ఒకసారి చూద్దాం.

Also Read : మేడం చుట్టూ విమర్శలు.. ఆ వెంటనే..!

అమెరికన్ మీడియా హైప్‌ ఫ్రెష్ ప్రకారం, నెతన్యాహు ఫోన్ కు ఉన్న ఎరుపు రంగు స్టిక్కర్ యాదృచ్ఛికం కాదు. ఇది ట్యాంపర్-ఎవిడెన్స్ సీల్, అధిక భద్రతా ఉన్న ప్రాంతాల్లో ఉపయోగించే ప్రత్యేక స్టిక్కర్. ఈ స్టిక్కర్ కెమెరాను కవర్ చేస్తుంది. ఎవరైనా అనుకోకుండా లేదా ఉద్దేశపూర్వకంగా సున్నితమైన సమాచారాన్ని ఫోటోల ద్వారా క్లిక్ చేయకుండా అడ్డుకుంటుంది. ఫోన్‌ లలో కెమెరాలు, మైక్రోఫోన్‌లు, ఇతర సెన్సార్‌లు ఉంటాయి, వీటిని ఉపయోగించి రహస్య సమాచారాన్ని రికార్డ్ చేయవచ్చు లేదా లీక్ చేయవచ్చు. సున్నితమైన సమాచారం ఉండే ప్రదేశాలలో గూఢచర్యం లేదా రికార్డింగ్ ఆపేందుకు ఫోన్‌లో స్టిక్కర్‌ ను అతికించడం అనేది భద్రతా చర్యగా తెలిపారు. ప్రధాని ఫోన్ మాత్రమే కాదని, అక్కడికి ఎవరు వెళ్ళినా కెమెరాకు స్టిక్కర్ ఉంటుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్