Monday, March 16, 2026 09:17 PM
Monday, March 16, 2026 09:17 PM

అందుకే ఇరాన్ మనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న జైశంకర్..!

ఇరాన్ – ఇజ్రాయిల్ దేశాల మధ్య యుద్ధం కారణంగా, భారత నౌకలు హార్మోజ్ జలసంధి దాటి రావడం కష్టంగా మారింది. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం జరిపిన చర్చలతో రెండు నౌకలకు ఇరాన్ అనుమతి ఇచ్చింది. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇరాన్ పర్యటన, దౌత్య చర్చల ఫలితంగా హోర్ముజ్ జలసంధి గుండా భారత నౌకల రాకపోకలకు మార్గం సుగమమైంది. దీనిపై ఆయన ఫైనాన్షియల్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ కీలక పరిణామాలను వివరించారు. తాము ఇరాన్‌ తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన వివరించారు.

Also Read : బీఆర్ఎస్ కు గంపెడు కష్టాలు.. ఏమైనా బయటపడుతుందా..?

ఈ చర్చలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని, ప్రస్తుతానికి భారతీయ జెండా ఉన్న నౌకలకు మాత్రమే ఇరాన్ ఈ వెసులుబాటు కల్పించిందని ఆయన తెలిపారు.. అయితే ఇది ఒక స్థిరమైన ఒప్పందం కాదని, ప్రతి నౌక ప్రయాణాన్ని సమన్వయం చేసుకోవాల్సి ఉంటుందని జైశంకర్ పేర్కొన్నారు. ఇటీవల శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధ నౌక ‘ఐరిస్ దేనా’ మునిగిపోయినప్పుడు, మరో ఇరాన్ నౌక ‘ఐరిస్ లావాన్’కు భారత్ అత్యవసరంగా కొచ్చి పోర్టులో ఆశ్రయం కల్పించింది. మానవతా దృక్పథంతో భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇరాన్ గౌరవించిందని ఆయన వివరించారు.

Also Read : విజయ్ కొడుకు జాసన్ సంజయ్ షాకింగ్ నిర్ణయం

తాము సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇది రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలను మరింత బలపరిచిందని ఆయన వ్యాఖ్యానించారు. భారతదేశ ఇంధన అవసరాల్లో ఎక్కువ భాగం ఈ మార్గం ద్వారానే వస్తుంది. కాబట్టి, ఉద్రిక్తతల వల్ల చమురు ధరలు పెరగకుండా, రవాణా ఆగకుండా చూడటమే ప్రభుత్వ ప్రాధాన్యత అని జైశంకర్ పేర్కొన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలపై ఆంక్షలు విధిస్తున్న ఇరాన్, భారత్‌తో ఉన్న చారిత్రక సంబంధాల దృష్ట్యా మన నౌకలకు మార్గం ఇవ్వడం సంతోషకరమని తెలిపారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అమరావతిలో అమరజీవికి అద్బుత...

తెలుగువారి ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం...

7 ఏళ్ళ ఒంటరి...

వైఎస్ వివేకా హత్య జరిగి దాదాపు...

పార్టీలో చంద్రబాబుకు ఎందుకీ...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం...

సిట్ ముందుకు అనంత్...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన...

ఫామ్‌హౌస్ ‘రచ్చ’ వెనుక.....

మోయీనాబాద్ ఫాం హౌస్ డ్రగ్స్ పార్టీ...

బీఆర్ఎస్ కు గంపెడు...

తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసి, పదేళ్ల...

పోల్స్