తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై పార్టీ నేతలు, కార్యకర్తలే గుర్రుగా ఉన్నారా.. ఎన్నికల్లో గెలిచామనే ఆనందం కార్యకర్తల్లో లేకుండా పోయిందా.. అధినేత తీరును పార్టీ కార్యకర్తలే తీవ్రంగా తప్పుబడుతున్నారా.. అంటే.. ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తుంది. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయ్యింది. అయితే తెలుగు తమ్ముళ్లు మాత్రం అంత సంతోషంగా లేరనే మాటే వినిపిస్తోంది. ఇందుకు ఏకైక కారణం.. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు.. ప్రభుత్వ పని తీరు అంటున్నారు కింది స్థాయి కార్యకర్తలు. ఎన్నికల ముందు పసుపు సైన్యం దూకుడుగా పని చేసింది. ఇంకా చెప్పాలంటే.. ఇప్పుడు కాకపోతే.. ఇంకెప్పుడు అన్నట్లుగా ప్రతి ఒక్కరు.. అటు క్షేత్రస్థాయిలో, ఇటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గానే పని చేశారు. నాటి వైసీపీ సర్కార్ చేసిన తప్పులను ప్రజలకు వివరించడం, జగన్ పాలనను ఎండగట్టడం.. వైసీపీ నేతలు చేసిన అరాచకాలను నిలదీయటం వంటివి చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం.. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్.
Also Read : జగన్ కొత్త ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా సుపరిపాలన సభను ప్రభుత్వం గ్రాండ్గా నిర్వహించింది. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేశామని.. ఎవరైనా సూపర్ సిక్స్ గురించి ప్రశ్నిస్తే.. వాళ్లకు నాలుక మందం అని చంద్రబాబు స్వయంగా వ్యాఖ్యానించారు. అలాగే ఏపీలో అరాచకాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు కూడా. అయితే ఈ మాటలే తెలుగు తమ్ముళ్లలో అసహనం కలిగిస్తున్నాయి. ఈ బెదిరింపులేనా.. చర్యలు తీసుకునేది ఏమైనా ఉందా అని నిలదీస్తున్నారు కూడా. టీడీపీ కార్యకర్తల అసహనానికి ప్రధాన కారణం కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులే.
Also Read : స్టార్ క్రికెటర్ పెళ్ళి వాయిదాకు అదే కారణమా..?
2019లో టీడీపీ ఓటమికి, వైసీపీ గెలుపునకు ఒకటే కారణం. అది జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య. సరిగ్గా ఎన్నికలకు నెల రోజుల ముందు ఈ హత్య జరిగింది. టీడీపీ నేతలే చేశారని వివేకానంద రెడ్డిని హత్య చేశారని.. దీని వెనుక చంద్రబాబు హస్తం ఉందని అప్పట్లో వైసీపీ అధినేత స్వయంగా ఆరోపించారు. చివరికి నారా సుర రక్తచరిత్ర అంటూ తాటికాయంత అక్షరాలతో సాక్షి పత్రికలో వార్త కూడా రాశారు. అందులో చంద్రబాబు చేతిలోనే కత్తి పెట్టి.. ఓ ఫోటో కూడా ముద్రించారు. ఇదే ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపింది. మా బాబాయిని చంద్రబాబు హత్య చేయించారని అప్పట్లో వైఎస్ జగన్ పెద్ద ఎత్తున ఎన్నికల సభల్లో ఆరోపించారు కూడా. ఇదే అప్పట్లో టీడీపీ ఓటమికి కారణం.
Also Read : కన్నప్పకు ఎవరి రెమ్యునరేషన్ ఎంత..?
అయితే వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసింది సొంత వారే అని ఆయన కుమార్తె డా.సునీతా రెడ్డి ఆరోపించారు. ఈ విషయంపై సుప్రీం కోర్టు వరకు న్యాయ పోరాటం చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. వివేకానంద హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర ఉందని.. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా సునీతా రెడ్డి బయటపెట్టారు. దీంతో అవినాష్ రెడ్డి కూడా బెయిల్ తెచ్చుకున్నారు. ఈ కేసులో సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని కూడా అరెస్టు చేశారు. అయితే ప్రస్తుతం ఈ కేసు విచారణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. వాస్తవానికి ఈ హత్య కేసులో తెర వెనుక మరో కీలక హస్తం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు సీబీఐ అధికారులు యత్నించారు. అప్పుడు కనీసం కర్నూలు నగరంలోనికి కూడా పోలీసులు రాకుండా వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆంక్షలు విధించారు.
Also Read : ఇరాన్ కు ట్రైనింగ్ ఇచ్చిన అమెరికానే ఇప్పుడు ఎందుకు టెన్షన్ పడుతోంది..?
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా ఈ కేసు విచారణ వేగవంతమవుతుందని అంతా భావించారు. కానీ ఇప్పటి వరకు ఆ కేసు అంగుళం కూడా ముందుకు కదల్లేదు. అసలు ఆ కేసు ఒకటి ఉందనే విషయం కూడా ప్రస్తుతం కూటమి సర్కార్ మర్చిపోయినట్లుందా అని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. నేరుగా చంద్రబాబుపైనే ఆరోపణలు చేసినా కూడా చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని నిలదీస్తున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టులు చేస్తున్నారు కానీ.. వివేకా హత్య కేసులో మాత్రం ఎందుకు ముందుకు వెళ్లటం లేదంటున్నారు. ఓ వైపు వైసీపీ నేతలు రప్పా రప్పా అంటూ డైలాగులు చెబుతున్నా కూడా.. కూటమి సర్కార్ మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటున్నారు. అసలు అవినాష్ సహ ప్లాన్ చేసిన వారిపై చర్యలుంటాయా లేదా అని ప్రశ్నిస్తున్నారు.

